పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

పర్యావరణ పరిరక్షణ , పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా గాంధీ హిల్ కొండపై ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్, రోస్ సొసైటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం 20 వేలసీడ్ బాల్స్( విత్తన బంతులు) చల్లారు.
ముఖ్య అతిధులుగా పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ , రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు కాట్రగడ్డ లక్ష్మీ తులసి, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి , టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్ తదితరులు పాల్గొని స్వచ్ఛంద సంస్థలు, పాఠశాల విద్యార్థులతో కలిసి విత్తన బంతులు చల్లారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు.
సీడ్ బాల్స్ ద్వారా ఖాళీ ప్రదేశాల్లో సహజ సిద్ధంగా మొక్కలు పెరిగేలా చేయవచ్చని , పచ్చదనాన్ని పెంచడానికి ఇది సులభమైన మార్గమన్నారు
రాబోయే రోజుల్లో
ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించినట్లు కాట్రగడ్డ లక్ష్మీ తులసి చెప్పారు.
ఆసక్తి ఉన్నవారికి విత్తనబంతులను ఉచితంగా అందజేస్తామన్నారు.
ఈ యజ్ఞంలో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమిష్టిగా పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు..
ఈ కార్యక్రమంలో రోజ్ సొసైటీ మరియు విజయవాడ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ మెంబర్స్ విశాల, స్వామి, కళ్యాణ్ లక్ష్మి,
కమల విశ్వనాధ్,
ప్రమిళ, ఘంటసాల లక్ష్మి, సీతామహాలక్ష్మి, అఖిలాండేశ్వరి, ఎ ఎస్ ఆర్ స్వామి,మోహన్ రావు, భద్రత -బాధ్యత ఫౌండర్ ఎస్ శ్రీనివాస్ , స్వర్ణ భారతి స్కూల్ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
![]()
