ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహణ – MLA బొండా ఉమామహేశ్వరరావు

Spread the love

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహణ – MLA బొండా ఉమామహేశ్వరరావు

ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడమే మా బాధ్యత – MLA బొండా ఉమామహేశ్వరరావు

ధి :-9-10-2026 ఈరోజు శుక్రవారం ఉదయం 11:00″గం లకు” సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల వారి కార్యాలయం నందు ప్రతి శుక్రవారం నిర్వహించి ప్రజా దర్బార్ (PGRS) నందు నేరుగా ప్రజల నుండి వినతి పత్రాలను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు స్వీకరించి, వివిధ సమస్యలతో తన వద్దకు వచ్చిన ప్రజల అభ్యర్థనలను స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తమ దృష్టికి తీసుకురావచ్చని, ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామని…

ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తగ్గించి, వారికి అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌర సేవలు సకాలంలో అందేలా చూడటం తమ బాధ్యతని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని…

ప్రజా దర్బార్ ద్వారా అందిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ప్రజల సమస్యలను వినడం మాత్రమే కాకుండా, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే ప్రజా దర్బార్ ప్రధాన ఉద్దేశమని బొండా ఉమామహేశ్వరరావు తెలియజేసారు…

ఈ కార్యక్రమంలో:- సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, మాజీ కార్పొరేటర్ పిరియ జగదాంబ, సురవరపు నాగరాజు, పిరియ సోమేశ్వరరావు, పైడి శ్రీను, తదితరులు పాల్గొన్నారు….

Loading