శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం,
పాత శివాలయం,శ్రీ నందీశ్వర స్వామి వారికి ప్రదోష కాల సమయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, విశేషార్చన పంచహారతులు, వన్ టౌన్, విజయవాడ.

NTR జిల్లా, విజయవాడ లో గల ద్వాపర యుగంలో శ్రీ ధర్మరాజు వారిచే ప్రతిష్టిoపబడిన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, పాత శివాలయం నందు శ్రీ పరాభవ నామ సంవత్సర భాద్రపద బహుళ త్రయోదశి అనగా ది:08-10-2026 గురువారం సాయంత్రం 4గంటల నుండి 6 గంటల వరకు శ్రీ నందీశ్వర స్వామి వారికి ప్రదోష కాల సమయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, విశేషార్చన మరియు పంచహారతులు, ఉభయదాతలకు మంత్ర పుష్పము, ఆశీర్వచనం కార్యక్రమములు జరిగినవి. ఈ కార్యక్రమములలో భాగముగా శ్రీయుత దేవస్థాన కార్యనిర్వహణాధికారి నటరాజన్ షణ్ముగం, ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ ధనేకుల. వెంకట సుబ్బారావు (చైర్మన్) సభ్యులు ఈది పార్వతి , కొట్టేటి సరిత రాజేశ్వరి, పోతుగుంట శాంతి, అబ్బురి నాగ శ్రీనివాస్, పత్తి శివరామకృష్ణ మరియు ఆలయ అర్చకులు రాచకొండ నాగరాజుశర్మ కె మురళీధరన్ నంబూద్రి అభిషేకపండిత్ కొత్తపల్లి సాయి కృష్ణ శర్మ సహాయక నాదెళ్ళ లక్ష్మి రాఘవేంద్ర శర్మ మరియు ఆలయ సిబ్బంది వారి అధ్వర్యంలో జరిగినవి.
![]()
