గర్భకండ్రిక భూముల సమస్య పరిష్కారం పై 8 గ్రామాల రైతులతో కొండపిలో సీఎం చంద్రబాబు ముఖాముఖి

Spread the love

గర్భకండ్రిక భూముల సమస్య పరిష్కారం పై 8 గ్రామాల రైతులతో కొండపిలో సీఎం చంద్రబాబు ముఖాముఖి


• గర్భకండ్రిక భూ సమస్యల గురించి సీఎంకు వివరించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
• 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ నిర్ణయం
• నర్సింగోలులో రైతుల కష్టాలు స్వయంగా విన్న ముఖ్యమంత్రి
• దశాబ్దాలుగా గర్భకండ్రిక భూములపై హక్కుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట కల్పించిన సీఎం
• గర్భకండ్రిక భూముల రైతులకు రైత్వారి పట్టాల జారీ అయ్యేలా సీఎం చంద్రబాబు నిర్ణయం
• ప్రకాశం జిల్లాలో 1,301 మంది రైతులకు ప్రయోజనం
• 4 మండలాల్లో 8 గ్రామాల్లో 2,915.10 ఎకరాల భూములకు పరిష్కార మార్గం చూపిన ముఖ్యమంత్రి
• రైతుల భూ హక్కుల గుర్తింపునకు చారిత్రక రెవెన్యూ రికార్డుల పరిశీలన
• 1959 నాటి ఫారం-2 రికార్డుల ఆధారంగా భూముల వివరాల పరిశీలన చేసిన సీఎం
• ఇనాం భూముల సమస్య పరిష్కారానికి చట్టబద్ధ ప్రక్రియ చేపడుతూ నిర్ణయం
• సాగు చేస్తున్న రైతులు సమర్పించిన పత్రాల పరిశీలన చేసిన ముఖ్యమంత్రి
• వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో భూముల వివరాల సవరణకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసిన సీఎం
• భూముల రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ రుణాలకు ఇబ్బందులు తొలగించేలా చర్యలు
• పంటల బీమా, సబ్సిడీలు, ప్రభుత్వ పథకాలు పొందేందుకు రైతులకు మార్గం సుగమం చేసిన ముఖ్యమంత్రి
• నర్సింగోలు గ్రామంలోనే 209 మంది రైతులకు 400.24 ఎకరాల మేర పట్టాలు జారీ
• కొండపి మండలంలో ఇలవర, వెన్నూరు గ్రామాల్లో 281 మంది రైతులకు 1003 ఎకరాలకు హక్కుల కల్పన
• జరుగుమిల్లి మండలం లో పచ్చవ, వర్దినేని పాలెం, నర్సింగోలు, కె.బిట్రగుంట గ్రామాల్లో 569 మందికి 1260 ఎకరాల భూమి కి పట్టాలు జారీ
• నాగులుప్పలపాడు మండలం ఓబన్నపాలెం లో 430 మందికి 567 ఎకరాల మేర పట్టాలు పంపిణీ
• సింగరాయకొండ కలికివాయ లో 21 మందికి 62 ఎకరాల మేర పట్టాలు పంపిణీ
• రైతులకు భూముల పై హక్కులు కల్పించటం తో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత వచ్చిందని తెలిపిన ముఖ్యమంత్రి
• దీర్ఘ కాలం గా పెండింగ్ లో ఉన్న భూ సమస్య కు పరిష్కారం చూపడం పై సంతోషం వ్యక్తం చేసిన రైతులు
• గర్భ కండ్రిక భూములకు పట్టాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కు ధన్యవాదాలు తెలిపిన రైతులు

Loading