ప్రకాశం జిల్లా ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో ఏళ్లనాటి భూ సమస్యలకు పరిష్కారం చూపిన సీఎం చంద్రబాబు

• ప్రకాశం జిల్లాలో ఒకే రోజు 3,304 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యలకు పరిష్కారం
• ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న 7,981 కుటుంబాలకు లబ్ది కలిగించిన కూటమి ప్రభుత్వం
• ప్రకాశం జిల్లాలోని 4 మండలాలు, 8 గ్రామాల్లోని 1,301 మంది రైతులకు ప్రయోజనం
• 2,915 ఎకరాల గర్భకండ్రిక భూముల సమస్యకు పరిష్కారం
• కొండపి, జరుగుమిల్లి, నాగులుప్పలపాడు, సింగరాయకొండ మండలాల్లో గర్భకండ్రిక భూములకు విముక్తి
• కొరిశపాడు మండలం బొల్లవరప్పాడు గ్రామంలో రూ.19 కోట్లకు పైగా విలువైన 26.42 ఎకరాల భూమిని 22-ఏ(1)(సీ) నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగింపు
• అద్దంకి నార్త్‌లో 14.96 ఎకరాలు, లింగసముద్రం మండలం పెంట్రాలలో 4.65 ఎకరాలు, సంతమాగులూరు మండలం అడవిపాలెంలో 7.80 ఎకరాలు, పంగులూరు మండలం ముప్పవరంలో 11.40 ఎకరాలను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగింపు
• కొత్తపట్నం మండలం పదార్థి గ్రామంలో 1969 భీమవరం ఘటనలోని ఎస్సీ, ఎస్టీ బాధితులకు గతంలో ఇచ్చిన డీకే పట్టాలకు ఆన్‌లైన్ రికార్డుతో పరిష్కారం
• పదార్థిలో 255 ఎకరాల భూమిని వెబ్‌ల్యాండ్‌లో అప్డేట్ చేయడం ద్వారా 311 కుటుంబాలకు ప్రయోజనం
• బల్లికురవ మండలం ఎస్.ఎల్. గుడిపాడులో రీ-సర్వే సమయంలో 68 ఎకరాల భూమిని ‘ఇనాం’గా నమోదు చేయడంతో రైతుల రిజిస్ట్రేషన్లకు ఇన్నాళ్లూ ఇబ్బందులు
• రికార్డుల్లో తప్పును సరిచేసి రైతులకు హక్కులు పొందేలా మార్గం చూపించిన కూటమి ప్రభుత్వం
• ప్రకాశం జిల్లాతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 244 ప్రధాన భూ సమస్యలకు పరిష్కారం, 41 వేల ఎకరాలకు పైగా భూమికి విముక్తి
• రూ.5 వేల కోట్లకు పైగా విలువైన భూములపై పూర్తి హక్కులు కల్పించడంతో 1.25 లక్షల కుటుంబాలకు ప్రయోజనం
• శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కంగుంది, గుటుపల్లి, కైకలూరు వంటి ప్రాంతాల్లో 100 ఏళ్ల నాటి భూ సమస్యలకు సైతం పరిష్కారం చూపించిన సీఎం చంద్రబాబు
![]()
