
జగ్గయ్యపేట సర్కిల్ కార్యాలయం, ఎన్. టి.ఆర్.పోలీస్ కమీషనరేట్
సీసీ కెమెరాల సాయంతో డిక్కీ దొంగతనం కేసును చేదించిన జగ్గయ్యపేట పోలీసులు
అంతర్రాష్ట్ర నిందితుడి వద్ద నుండి పూర్తి చోరీ సొత్తు రూ. 4,62,590/- స్వాదీనం
గత నెల (అక్టోబర్) 30వ తేదీన జగ్గయ్యపేటలోని చిల్లకల్లు రోడ్డులో ఒక డిక్కీ అఫెన్స్ (వాహనం డిక్కీలోంచి నగదు చోరీ) సంఘటన జరిగింది. బాధితుడు తన స్కూటర్ సీటు కింద ఉంచిన రూ. 4,62,590/- నగదును ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగ్గయ్యపేట ఎస్.ఐ. కేసు నమోదు చేయగా, నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.ఆదేశాల మేరకు రూరల్ డి.సి.పి. బి.లక్ష్మి నారాయణ ఐ.పి.ఎస్. స్వీయ పర్యవేక్షణలో జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికతను ఆధారంగా చేసుకుని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.
ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానం మరియు ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో నిందితులను గుర్తించి వారి కదలికలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ కి రాబడిన పక్కా సమాచారం మేరకు నిందితులలో ఒకరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి చోరీ కాబడిన పూర్తి చోరీ సొత్తు మొత్తం రూ. 4,62,590/- నగదును స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.
నిందితుడి వివరాలు.:
మేకల ప్రకాష్, తండ్రి: నారాయణ, వయస్సు: 37 సంవత్సరాలు, కులం: ముదిరాజ్, ఊటై గ్రామం, కొత్తగూడెం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
పరారీలో ఉన్న మరో నిందితుడైన మేకల రాజేష్, తండ్రి: ప్రభు, ముదిరాజ్, ఊటై గ్రామం, కొత్తగూడెం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ. ఇతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఈ నిందితులు మహారాష్ట్రలో కూడా ఇదే తరహా నేరాలు చేసి, పలుమార్లు జైలుకెళ్లి శిక్ష అనుభవించినట్లు విచారణలో తేలింది.
భారీ మొత్తంలో నగదును తీసుకెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాపార సంస్థలు, బ్యాంకుల వద్ద సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించి, వంద శాతం సొత్తును రికవరీ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు ని, జి.రాజు, ఎస్.ఐ., జగ్గయ్యపేట మరియు ఎమ్.ఎస్.కె.అర్జున, ఎస్.ఐ., పెనుగంచిప్రోలు మరియు వారి సిబ్బందిని నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
![]()
