
రామవరప్పాడు పంచాయతీ ఎన్నికల వేడి: కూటమి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు
ఎంపీటీసీ రాము ఆధ్వర్యంలో నామినేషన్ల దాఖలు ,విస్తృత ప్రచారం
(విజయవాడ రూరల్)
రామవరప్పాడు గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం నాడు మరింత వేడెక్కింది. గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయంలోని ఎన్నికల అధికారి (రిటర్నింగ్ ఆఫీసర్) సమక్షంలో వార్డు సభ్యులుగా చల్లా చిన్నారావు, రోశయ్య, వార్డు సభ్యురాలిగా పోలం భవాని సహా మొత్తం నలుగురు కూటమి అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థులకు తమ మద్దతు తెలిపారు.
నామినేషన్ల అనంతరం అభ్యర్థులు మాట్లాడుతూ, గ్రామ సమగ్ర అభివృద్ధికి మరియు వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తాము ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో కూటమి అభ్యర్థులందరూ ఘన విజయం సాధిస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు.
నలుగురు వార్డు అభ్యర్థుల గెలుపు బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఎంపీటీసీ రాము మీడియాతో మాట్లాడుతూ
పోటీ చేస్తున్న నలుగురు అభ్యర్థులు రామవరప్పాడు ప్రజలతో నిత్యం మమేకమై తిరిగే వారేనని, వారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణం, స్మశాన వాటికలో కోల్డ్ స్టోరేజ్ రూమ్ మరియు ప్రహరీ గోడ నిర్మాణం చేపడతామని తెలిపారు.
గ్రామ డ్రైనేజీ పైపుల సమస్య పరిష్కారం, కర్మకాండల భవన నిర్మాణం, అలాగే ప్రతి ఇంటికీ మంచినీటి పంపు అందించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.అదేవిధంగాసర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొల్ల ఆనంద్ కుమార్ గారిని కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని రామవరప్పాడు గ్రామ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
![]()
