
రామవరప్పాడు సర్పంచ్ అభ్యర్థి కొల్ల ఆనంద్ కుమార్ తమ గ్రామంలో సుడిగాలు పర్యటన చేస్తూ
గ్రామ సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని వెల్లడి
రామవరప్పాడు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) సర్పంచ్ అభ్యర్థి కొల్ల ఆనంద్ కుమార్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సోమవారం గ్రామంలోని పలు వార్డులలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. కొల్ల ఆనంద్ కుమార్ కి స్థానిక ప్రజలు పూలమాలతో స్వాగతం పలుకుతూ హారతులతో నిరాంజనాలు పలుకుతున్నారు అని వారు తెలిపారు
ప్రచారం అనంతరం కొల్ల ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ “గత ఇరవై ఏళ్లుగా జయ అపజయాలతో పని లేకుండా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నామని గ్రామ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నమని. కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా రామవరపాడులో నాలుగున్నర కోట్లతో సబ్ స్టేషన్, మూడున్నర కోట్లతో జలజీవన్ మిషన్ పనులు, జరుగుతున్నాయని, నన్ను గెలిపిస్తే తాగునీటి సమస్యల పరిష్కారానికి, రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత, ఏలూరు కాలువపై వంతెన నిర్మాణానికి మొదటి ప్రాధాన్యత అన్నారు ఎన్డీఏ కూటమి తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రావడం నా బాధ్యతను మరింత పెంచింది. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య మెరుగు పరుస్తామని.ప్రజలందరూ మా 20 మంది వార్డు సభ్యుల ప్యానెల్‌ను ఆదరించి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను” అని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ స్థానిక నాయకులు, వార్డు సభ్యుల అభ్యర్థులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()
