ఘనంగా నగరంలో ‘అర్జున్ స్టీల్ ఫర్నిచర్’ ఎక్స్‌పీరియన్స్ స్టోర్ ప్రారంభం

Spread the love

ఘనంగా నగరంలో ‘అర్జున్ స్టీల్ ఫర్నిచర్’ ఎక్స్‌పీరియన్స్ స్టోర్ ప్రారంభం

రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభం

విజయవాడ: నగరంలోని గవర్నర్ పేట, కాలేశ్వరరావు రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అర్జున్ స్టీల్ ఫర్నిచర్’ ఎక్స్‌పీరియన్స్ స్టోర్ ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో పాటు 60వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, 31వ డివిజన్ కార్పొరేటర్ గడ్డం బాల వెంకట రవికుమార్, ప్రకాష్ ఆర్ట్స్ అధినేత సి.డి.వి. సుబ్బారావు పాల్గొని నిర్వాహకులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెండున్నర దశాబ్దాలుగా వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకున్న సంస్థ విజయవాడలో నూతన షోరూమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా డిజైన్లు:
సంస్థ చైర్మన్ రాహుల్ చల్లగండ్ల మీడియాతో మాట్లాడుతూ.. 25 ఏళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తమ ఫ్యాక్టరీని ప్రారంభించామని తెలిపారు. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా వినియోగదారుల మన్ననలు పొందుతూ, ఇప్పుడు విజయవాడలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, సాఫ్ట్‌వేర్ కంపెనీలు మరియు ఆఫీసులకు అనువైన ఫర్నిచర్ ఆకట్టుకునే డిజైన్లలో, సరసమైన ధరలకు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా కస్టమైజ్డ్ డిజైన్లు తయారు చేసి ఇవ్వడం తమ ప్రత్యేకత అని వివరించారు.
సామాన్యులకు అందుబాటు ధరల్లో నూతన మోడల్స్:
సంస్థ నిర్వాహకులు ఎం. హర్ష తేజ, సత్యనారాయణ మాట్లాడుతూ.. తమ స్టోర్ ను స్వయంగా విచ్చేసి ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంచి క్వాలిటీకి అర్జున్ స్టీల్ ఫర్నిచర్ మారుపేరని, రీజనబుల్ రేట్లకే నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నామన్నారు. తమ వద్ద ఎగ్జిక్యూటివ్ టేబుల్స్, ఆఫీస్ చైర్స్, కంప్యూటర్ మరియు కెమిస్ట్రీ ల్యాబ్ వర్క్ స్టేషన్స్, కాన్ఫరెన్స్ మరియు ఆడిటోరియం హాల్స్, వెయిటింగ్ హాల్ చైర్స్, ఐరన్ అల్మారాలు, ఐరన్ వుడెన్ కబోర్డ్స్, హాస్పిటల్ ఫర్నిచర్, కెఫెటేరియా ఫర్నిచర్ మరియు సోఫా రిక్లైనర్స్ వంటి ఎన్నో నూతన మోడల్స్ అందుబాటులో ఉన్నాయని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Loading