
రామవరప్పాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రత్నం నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు
20 మంది వార్డు సభ్యులతో కలిసి నామినేషన్లు వేసిన కూటమి ప్యానెల్
విజయవాడ రూరల్: రామవరప్పాడు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా రత్నం నాగేశ్వరరావు నేడు తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు 20 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు కూడా ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పర్యవేక్షణలో ఈ నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది.
నామినేషన్ దాఖలు అనంతరం రత్నం నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆశీస్సులతో 20 మంది వార్డు మెంబర్ల ప్యానెల్‌తో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రామవరప్పాడు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలందరూ తమ ప్యానెల్‌ను ఆదరించి అఖండ విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) డైరెక్టర్ గరికపాటి శివశంకర్, రిటైర్డ్ ఈవో గంటా రామ్మోహన్ రావు,విజయవాడ రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు పొదిలి దుర్గారావు ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు . తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
![]()
