తేది: 31-07-2024
మాజీ ఎమ్మెల్సీ, బుద్దా వెంకన్న విలేకరుల సమావేశం వివరాలు
బుధవారం జగన్‌మోహన్ రెడ్డి ఒక యాప్‌ను ప్రారంభిస్తున్నామని ఆ యాప్‌లో ప్రజల కష్టాలను తెలుసుకుంటానని చెప్పడం మాత్రం చాలా సంతోషంగాఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎవరూ కష్టాలు పడటం లేదు.
జగన్ మోహన్‌రెడ్డి గతంలో రూ.3 వేల పెన్షన్ చేస్తానని హామీ ఇచ్చి రూ.250.. రూ.250.. రూ.250 పెంచుకుంటూ చివరలో రూ. 3 వేలు చేస్తే చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం రూ.4 వేలకు పెంచడమే కాక ఎన్నికలు జరిగిన ఏప్రిల్, మే నెలలకు కూడా రూ.వెయ్యి చొప్పున కలిపి మొత్తం రూ.6 వేలు ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం పేరుమీద ఒక ఇంటిలో ఇద్దరు పిల్లలు ఉన్నా ఒకరికే జగన్‌మోహన్ రెడ్డి డబ్బులు వేసే వారు. చంద్రబాబు అమ్మవడి పేరుతో ఎంత మంది పిల్లలు ఉన్నా అంత మంది పిల్లలకు డబ్బులు వేయడం జరిగింది. నంద్యాలలో 11 మంది పిల్లలు ఉంటే 11 మంది పిల్లలకూ డబ్బులు వేయడం జరిగింది. కాబట్టి ఏపీలో కూటమి ప్రభుత్వంలో అందరూ సుఖ శాంతులతో ఉన్నారు.
కానీ నువ్వు యాప్ పెట్టడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నీ హయాం (2019`24)లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కల్తీ మద్యం వల్ల ఎంత మంది చనిపోయారు? ఎన్ని తాళిబొట్టు తెగిపోయాయి వీటన్నింటినీ జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవడానికి యాప్ అవసరం. జగన్ నడిపిన కల్తీ మద్యం వల్ల దాదాపు 30 వేల మంది చనిపోయారు. ఆ వివరాలతో సహా ప్రజలు నీకు చెప్పడానికి రడీగా ఉన్నారు. దీనికి ఈ యాప్ అవసరం. మద్యం స్కాంలో పందికొక్కుల్లాగా దోచుకున్నారే మీరు, మీ వెనకాల ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డిలాంటి వ్యక్తులు. అది తెలుసుకోవడానికి యాప్ అవసరం. అలాగే ల్యాండ్ టైటిలింగ్‌ను తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆస్తుల్ని, పొలాలను, ప్లాట్‌లను దోచుకున్నారు కదా. వీటిని తెలుసుకోవడానికి యాప్ అవసరం. అలాగే భారతదేశంలోనే జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వివరాలు తెలుసుకోవడానికి మీకు యాప్ అవసరం. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించి నువ్వు మాత్రం లక్షల కోట్లు దోచుకోవడమేకాక మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు వందల, వేల కోట్ల రూపాయలను దోచుకున్నారు. కాబట్టి అవన్నీ ప్రజల ద్వారా తెలుసుకోవడానికి యాప్ అవసరం. నీ రాక్షస పాలనలో ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి నువ్వు దిగిపోయేంతవరకు నీవు చేసిన అరాచకాలన్నీ తెలుసుకోవడానికి యాప్ అవసరం. చంద్రబాబు గారు ఇసుకను ఉచితంగా ఇస్తే దీనిని రద్దు చేసి ఇసుకను బంగారంలా దోచుకున్నారు కదా. దీని వల్ల భవననిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి, ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటిని తెలుసుకోవడానికి నీకు యాప్ అవసరం. సోషల్ మీడియా ద్వారా టీడీపీ పార్టీకి చెందిన మహిళల మీద ప్రచారం చేయించారు కదా. వీటిని తెలుసుకోవడానికి యాప్ అవసరం. అలాగే పోలీస్ వ్యవస్థను నీ సొంత జేబు సంస్థగా వాడుకుని ఎంతో మంది మీద అక్రమ కేసులు పెట్టావు. వీటిని తెలుసుకోవడానికి యాప్ అవసరం. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రజలు ఆ యాప్‌లో ఏం పెట్టారో బయటపెట్టు. వాటిపై శ్వేత పత్రం విడుదల చేయి.
జగన్ మోహన్ రెడ్డి యొక్క లక్కీ నెంబర్ ఇక నుంచి 11. ఎలాగంటే ఆయనకు ప్రజలు 151 సీట్లు ఇస్తే.. ఈ దుర్మార్గాలన్నీ చేయడం వల్ల మధ్యలో 5 నెంబరును తొలగించి 11 ను ప్రజలు ఇచ్చారు. హైదరాబాద్‌లో లిక్కర్ స్కాంలో మొదట దొరికిన డబ్బు రూ.11 కోట్లు. కాబట్టి జగన్ మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ 11. ఇక నుంచి ఆయనను 11 అంటాం. లిక్కర్ స్కాంలో మిగతా రూ. వేల కోట్లను కూడా కక్కిస్తాం.
ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఒక పోస్కోలు మాజీ మంత్రి పేర్ని నాని. అతను చెప్పేవన్నీ పోస్కోలు కబుర్లే. మాపై దాడి చేసిన తురుక కిశోర్ అనే వ్యక్తిని జైలు నుంచి బయటకు వచ్చాక అంతకు ముందు ఇంకో వ్యక్తి మీద దాడి చేసిన 307 కేసులో అతనిని అరెస్టు చేస్తే… విజయవాడ నుంచి ఆకురౌడీ వెళ్లి అక్కడ తొడలు కొట్టారని అందుకే దాడి చేశారని మా మీద వ్యంగ్యంగా ఈ పోస్కోలు పేర్ని నాని మాట్లాడారు. డబుల్ మర్డర్ కేసులో సింగిల్ ముద్దాయిలా ఈ పోస్కోలు నాని మాట్లాడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి పేర్ని నానికి మంత్రి పదవి ఇస్తే అమాయకురాలు అయిన ఆయన భార్య పేరు పెట్టి బియ్యం స్కాం చేశాడు. ఆమె కేసులో ఇరుక్కున్నా పరువాలేదు… నేను ఇరుక్కోకూడదని అంత నీచమైన బుద్ధి కలవాడు ఈ పోస్కోలు నాని. మా కృష్ణా జిల్లాలో ఉన్న ఆకురౌడీలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, జోగిన రమేష్‌ల వద్ద నెల నెలా పేమెంట్‌లను తీసుకుని పేర్ని నాని మాట్లాడుతుంటాడు. పేర్ని నాని నీకు దమ్ముంటే బియ్యం స్కాంలో తప్పు ఉన్నా… ఒప్పు ఉన్నా… నాదే అని ధైర్యంగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పగలవా? నువ్వు బియ్యం బుక్కేసిన దొంగవి. కృష్ణా జిల్లాలోని ఆకురౌడీలందరికీ వత్తాసు పలికే పేర్ని నాని కృష్ణా జిల్లా నుంచి వెళ్లి ఇంకొక ఆకురౌడి మాచెర్లకు చెందిన తురుక కిశోర్ దాకా వెళ్లాడు. బీసీ అయిన తురుక కిశోర్‌ను అరెస్టు చేశారని పోస్కోలు నాని మాట్లాడుతున్నాడు. నేను ఎవరిని? నేను బీసీని కాదా? మమ్మల్ని చంపితే మున్సిపల్ ఛైర్మెన్ ఇస్తామని వేలం పాట పెట్టి మా తలలకు వెల కడతారా మీరు? ఈ రోజు తురుక కిశోర్ బీసీ అని మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నావు నీవు?
వైసీపీ ప్రభుత్వంలో రెండు పందికొక్కులు ఒకటి పేర్ని నాని, ఇంకొకటి కొడాలి నాని. ఈ రెండు పందికొక్కులూ బియ్యమే తిన్నాయి. బియ్యపు దొంగలు వీళ్లు. బీసీల గురించి మాట్లాడే అర్హత పేర్ని నానికి ఉందా? మాటకు వస్తే పవన్ కళ్యాణ్ గారిని వాడని.. వీడని తిట్టే పేర్ని నాని ఆఖరికి అతని కులపు వాళ్లను కూడా దూరం చేసుకున్నాడు. కొల్లు రవీందర్‌ను అన్యాయంగా ఇరికించి 53 రోజులు జైలులో పెట్టించి బీసీ కులాలన్నింటినీ దూరం చేసుకున్నాడు. పేర్ని నాని కానీ, అతని కుటుంబంలోని సభ్యులు కానీ చరిత్రలో ఇక బందరులో గెలవరు. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావా?
ఎప్పుడైతే తురుక కిశోర్‌ను అరెస్టు చేయడం అన్యాయం అని అన్నావో అప్పుడే పేర్ని నాని కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇక రేపటి నుంచి ఉంటుంది నీకు సినిమా.
-తెలుగుదేశం ప్రకాశ్ రెడ్డి