అమరావతి : ది డెస్క్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పిపోయిన బాలికలను గుర్తించి, వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక కార్యక్రమం ‘Operation TRACE’ ప్రారంభమైందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ రూపంలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా డీజీపీ హరిష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ….
“బాలికల అపహరణలు, తప్పిపోవడాలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఆగష్టు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ ను చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం పూర్తి సమన్వయంతో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమంలో పాల్గొంటుందన్నారు. కుటుంబాల నుండి దూరమైన బాలికలను గుర్తించి, వారికి అవసరమైన సహాయం అందించి, తిరిగి వారి కుటుంబాల వద్దకు చేర్చడమే ఆపరేషన్ ట్రేస్ లక్ష్యం” అని డీజీపీ తెలిపారు.
TRACE.
- T:- Trace – తప్పిపోయిన బాలికల కేసులకు సంబంధించి ఉపయోగిస్తున్న CCTNS, MISSION VATSALYA PORTAL, FACIAL RECOGNITION, TRANSPORT HUBS, SHELTERS, BORDER CHECKPOSTS మరియు NGOల ద్వారా తప్పిపోయిన బాలికలను గుర్తించటం. సమస్యాత్మక ప్రదేశాలలో మహిళా పోలీసులతో నిఘా ఏర్పాటు చేయడం.
- R :- Reconnect కాపాడినటువంటి బాలికలను వారి కుటుంబాలతో కలిపి వారికి తాత్కాలిక నివాసము ఏర్పాటు మరియు సంబంధిత చైల్డ్ వెల్ఫేర్ కమిటీలను (CWC) సమన్వయ పరచటం.
- A-: Assist – త్వరితగతిన వారికి మెడికల్ కేర్, ఆహారం, వసతి, దుస్తులు మరియు న్యాయసలహాలను ఏర్పాటు చేసి వారికి వయస్సు నిర్ధారణ పరీక్షలు మరియు గుర్తింపుకు సంబంధించిన పత్రాలను రూపొందించడం, వారిపై ఆకృత్యాలు జరిగినచో FIR నమోదు చేయించడం.
- C:- Counsel – NGOs ద్వారా కౌన్సిలర్స్ ని నియమించి బాధిత బాలికలకు మానసిక సంబంధమైన సమస్యలకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం.
- E:- Empower – వారికి చదువు, స్కిల్ ట్రైనింగ్, కెరీర్ గైడెన్స్ మరియు ప్రభుత్వ వెల్ఫేర్ స్కీంలు కల్పించడం.
ACTION PLAN :- “OPERATION TRACE’ ఈ కార్యక్రమానికి సంబంధించి ఆగష్టు నెల ఒకటి, రెండవ తారీఖుల్లో డేటా కలెక్షన్ కై జిల్లా మరియు సబ్- డివిజన్ స్థాయిలో టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేయడం.ఆగష్టు నెలలో 3వ తేదీ నుంచి, 10వ తేదీ వరకు NGOs, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న Shelterst తనిఖీ చేయడం. సంబంధిత FIRలను RE-VERIFICATION చేయడం, అందులో భాగంగా టెక్నాలజీని ఉపయోగించడం. FACE RECOGNITION, DNA TEST, AADHAR ద్వారా వయస్సుకు సంబంధించిన సమాచారం సేకరించడం. సంబంధిత కుటుంబ సభ్యులతో మాట్లాడటం.
ఆగష్టు నెలలో 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రైల్వేస్టేషనలలో, బస్టాండ్లలో, ప్రార్ధనా స్థలాల్లో మరియు రెడ్ లైట్ ఏరియాలలో ప్రత్యేక తనిఖీల ద్వారా తప్పిపోయిన బాలికలను గుర్తించడం మరియు ప్రజల యొక్క భాగస్వామ్యంతో “FIND HER” అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.
శక్తి యాప్ లో “REPORT MISSSING CHILDREN” అనే ఫీచర్ ద్వారా తప్పిపోయిన పిల్లల కోసం ఫిర్యాదు చేయవచ్చు మరియు ఆపద సమయంలో (emergency) సహాయం కోసం SOS బటన్ నొక్కిన వెంటనే పోలీసులు తక్షణమే స్పంధించి సహాయం చేయగలరన్నారు. తప్పిపోయిన పిల్లలకు సంభంధించిన సమాచారాన్ని 112 నెంబర్ కి ఫోన్ చెయ్యడం ద్వారా లేదా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కి, ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181కి మరియు శక్తి వాట్స్ యాప్ నెంబర్ 7993485111కు సమాచారం ఇవ్వడం ద్వారా సహాయం పొందగలరన్నారు.
రాష్ట్రంలో ప్రతి పోలీసు యూనిట్ లో మహిళల రక్షణకై శక్తి టీమ్ లు పని చేస్తున్నాయన్నారు. ఈ టీమ్ లు బహిరంగ ప్రదేశాలలో eve teasing చేసే ఆకతాయిల భరతం పడుతున్నాయన్నారు. ప్రతి జిల్లా యూనిట్ కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన One Stop Centre లు బాధిత మహిళలకు మరియు బాలికలకు అన్ని విధాలుగా సహాయం చేయటం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి స్కూల్ నందు గల క్లాస్ రూమ్ నుండి 5గురు బాలికలను శక్తి వారియర్స్ గ్రూప్ గా ఏర్పాటు చేసి, వారికి శక్తి టీమ్స్ ద్వారా Good Touch & Bad Touch ల గురించి వివరించి, తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి బాలికలకు తెలియజేయటం జరిగిందన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా యూనిట్లలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి ప్రాధాన్యతగా ‘OPERATION TRACE’ ను పోలీసు స్టేషనుల ద్వారా నిర్వహించవలసినదిగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీచేశారు.
ఈ కార్యక్రమంలో ADGP (L&O) ఎన్. మధుసూదన రెడ్డి IPS, IGP APSP మరియు ఇంచార్జ్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ బి. రాజకుమారి IPS, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ SP, N. శ్రీదేవిరావు IPS, తదితరులు పాల్గొన్నారు.