బంగారు కుటుంబాలకు మార్గదర్శుకులు మీరే అవకాశాలను అందిపుచ్చుకుని పారిశ్రామికవేత్తలు

0

ఎన్‌టిఆర్‌ జిల్లా తేది:01.08.2025

        బంగారు కుటుంబాలకు మార్గదర్శుకులు మీరే
        అవకాశాలను అందిపుచ్చుకుని పారిశ్రామికవేత్తలు కండి..స్వర్ణాంధ్ర `విజన్‌ 2047 లక్ష్యంలో భాగస్వాములు కండి.జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ           

పెదరిక నిర్మూలనే లక్ష్యంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సెర్ప్‌ ద్వారా  శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అన్నారు. 

విజయవాడ రూరల్‌ గొల్లపూడి లోని హోటల్‌లో సెర్ప్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి వ్యవసాయ ఆధారిత జీవనోపాదుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ (సెర్ప్‌)  ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు మహిళల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు  మహిళా సాధికారకతకు తోడ్పడుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పి4  కార్యక్రమంలో భాగస్వాములై  మహిళా పారిశ్రామిక వేత్తలు బంగారు కుంటుంబాలకు మార్గదర్శుకులు కావాలన్నారు. తద్వారా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన స్వర్ణాంధ్ర విజన్‌ 2047 లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని కోరారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పటికే ఎగ్జిబిషన్లు, వర్క్‌షాపులు,  ప్రత్యేక ఇగ్నేట్‌ సెల్‌ ద్వారా అవగాహన కల్పిస్తూ ప్రతి మహిళను  పెదరికం నుండి దూరం చేసి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించుకోవాలన్నారు. జాతీయ ఉపాధి హామీ, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల ద్వారా అమలు జరుగుతున్న పథకాలతో పాటు  ఏపి ఫడ్‌ ప్రాససింగ్‌ సోసైటీ (ఎపిఎఫ్‌పిఎస్‌), ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (పిఎంఎఫ్‌ఎంఇ) పథకాలపై పూర్తి  అవగాహన కలిగి సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ లక్ష్మీశ అన్నారు. 
సెర్ఫ్‌  సీఈవోవాకాటి  కరుణ  వర్చువల్‌ గా హాజరై దశ దిశా నిర్దేశించారు.  శిక్షణా కార్యక్రమానికి  రాష్ట్రవ్యాప్తంగా  అన్ని జిల్లాల  డిపిఎం లైవ్లీహుడ్స్‌, ఏపిఎం లైవ్లీహుడ్స్‌ హాజరయ్యారు.

ముగింపు  కార్యక్రమంలో డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎన్‌.వి.నాంచార రావు  సెర్ప్‌ అసి స్టెంట్‌ డైరెక్టర్‌ మహిత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version