పండ‌గ వాతావ‌ర‌ణంలో పింఛ‌న్ల పంపిణీ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

0

01.08.2025
కోట‌బొమ్మాళి

పండ‌గ వాతావ‌ర‌ణంలో పింఛ‌న్ల పంపిణీ

గ‌త ప్ర‌భుత్వం తొల‌గించిన 1.20 ల‌క్ష‌ల పింఛ‌న్ల‌ పుణ‌రుద్ధరణ‌

రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క‌రోజే 1.09 ల‌క్ష‌ల మంది వితంతు ఫించ‌న్ల‌ పంపిణీ చేసిన ఘ‌న‌త కూట‌మి ప్ర‌భుత్వానిది

ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ అమలు.. 47 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాలో న‌గ‌దు జమ చేస్తాం

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వం సంయుక్తంగా రైతు ఖాతాల్లో రూ . రూ.3,156 కోట్లు జ‌మ

అన్న క్యాంటీన్లను రద్దుచేసి పేదల కడుపు కొట్టిన జ‌గ‌న్ రెడ్డి

వైకాపా నాయ‌కులు ఆలీబాబా 40 దొంగలు ప్రజలను మోసం చేసేందుకు గ్రామాల్లో తిరుగుతున్నారు.. ప్ర‌జ‌లు వారిని నిల‌దీయాల‌ని

రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

కోట‌బొమ్మాళి, ఆగ‌స్ట్ 1 – రాష్ట్రంలో గ‌త ప్ర‌భుత్వం దుర్మార్గ‌మైన పాల‌న కార‌ణంగా అన్ని వ్య‌వ‌స్థ‌లు నీర్వీర్యం అయ్యాయ‌ని, ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కూడా జ‌ర‌గ‌లేద‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. శ్రీ‌కాకుళం జిల్లా కోట‌బొమ్మాళి మండ‌లం తుల‌సిపేట గ్రామంలో శుక్రవారం ఎన్టీఆర్ భ‌రోసా ఫింఛ‌న్ల‌ పంపిణీ కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొని ఇంటి ఇంటికీ వెళ్లి పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌ని అన్నారు. రూ. 35 నుంచి ప్రారంభ‌మైన పింఛ‌ను నేడు రూ. 4 వేలు ఇస్తున్న ఘ‌న‌త కూట‌మి ప్ర‌భుత్వానిద‌ని, ఇచ్చిన మాట ప్ర‌కారం అన్ని హామీలు అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. 64 ల‌క్ష‌ల మందికి రూ. 34 వేల కోట్ల రూపాయ‌ల‌ను పింఛ‌న్ల కోసం ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తుంద‌ని అన్నారు. రాష్ట్రంలో గ‌త‌ ప్ర‌భుత్వం 1.20 ల‌క్ష‌ల మందికి వితంతు పంఛ‌న్లను తొల‌గించింద‌ని, వాటిని నేడు కూట‌మి ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో పున‌రుద్ధ‌రించామ‌ని తెలిపారు. వివిధ కార‌ణాల‌ కార‌ణంగా కొన్ని తిర‌స్క‌ర‌ణ అయ్యాయ‌ని, వాటిని ప‌రిశీలించి అర్హత ఉన్న వారికి మంజూరు చేయ‌డం జ‌రుగుతంద‌ని హ‌మీ ఇచ్చారు. ఒక్కరోజే 1.09 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసిన ఘ‌న‌త కూట‌మి ప్ర‌భుత్వానిద‌ని, సంక్షేమ ప‌థ‌కాల‌తో దుసుకుపోతున్న కూట‌మి ప్ర‌భుత్వం మ‌రో మంచి కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నామ‌ని ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ ప‌థ‌కం కింద రాష్ట్రంలో 47 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరేలా రూ.3,156 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 5వేలు, కేంద్ర ప్రభుత్వం 2,000, మొత్తం 7,000 డైరెక్ట్‌ గా రైతుల‌ ఖాతాలోకి వేస్తున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమ‌లు చేస్తున్నామ‌ని, త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం కింద అర్హ‌త ఉన్న వారికి ఎంత మంది ఉంటే అంత మందికి మొత్తం రూ. 8,700 కోట్ల రూపాయాలు జ‌మ చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని స‌మాంత‌రంగా తీసుకు వెలుతున్నామ‌ని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు కింజరాపు హరిప్రసాద్, ఆర్డిఓ ఎం. కృష్ణమూర్తి, ఎమ్మార్వో ఆర్. అప్పలరాజు, ఎంపీడీవో ఫణీంద్ర కుమార్, గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

వైకాపా నాయ‌కులు ఆలీబాబా 40 దొంగలు ప్రజలను మోసం చేసేందుకు గ్రామాల్లో తిరుగుతున్నారు.. ప్ర‌జ‌లు వారిని నిల‌దీయండి

వైకాపా నాయ‌కులు బాబు షూరిటీ మోసం గ్య‌రంటీ అంటూ గ్రామాల్లో తిరుగుతున్నార‌ని, అస‌త్య ప్ర‌సారాలు చేస్తూ ఆలీబాబా 40 దొంగల్లా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న‌ వారిని ప్ర‌జ‌లు నిల‌దీయాల‌ని సూచించారు. గ‌త‌ ఐదేళ్ల పాటు అభివృద్ధి ప‌నుల‌ను చేయ‌ని వారికి కూట‌మి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే హ‌క్కు లేదన్నారు. రాష్ట్రంలో ఏడాదిలో చేసిన అభివృద్ధి వారి కంటికి క‌నిపించ‌దా అని ప్ర‌శ్నించారు. అన్న క్యాంటీన్లను రద్దు చేసిన జగన్ పేదల కడుపు కొట్టారని తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు, రూ.5 కే అన్నం పెడుతూ రాష్టంలో రోజుకు 2.5 లక్షల మందికిపైగా ఆకలి తీర్చుతున్నామ‌ని అన్నారు. రాష్ట్రంలో 3.5 ల‌క్ష‌ల పింఛ‌న్లు, 1.20 ల‌క్ష‌ల వితంత పింఛ‌న్లు తొల‌గించార‌ని ఆరోపించారు. కూట‌మి ప్ర‌భుత్వం వాటిని పున‌రుద్ధ‌రించింద‌ని, ఇవి వారి కంటికి క‌నిపించ‌వా అని ప్ర‌శ్నించారు. గ్రామాల్లో త‌ట్టెడు మ‌ట్టితీసి ఒక్క అభివృద్ది ప‌నులు కూడా చేయ‌ని వారు నేడు అభివృద్ధి , సంక్షేమంపై మాట్లాడే అర్హ‌త వారికి లేద‌ని అన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version