మెరుగైన వైద్యం కోసం
ఎల్ .ఓ .సీ అందజేత
ఎన్డీఏ కార్యాలయంలో
కూటమి నేతలతో కలిసి అందజేసిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన
(లెటర్ ఆఫ్ క్రెడిట్)
ఎల్.ఓ.సి ను
శుక్రవారం భవానిపురం
ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి
ప్రత్తిపాటి శ్రీధర్ , కూటమి నేతలతో కలిసి
అందజేశారు.
38వ డివిజన్ రావి చెట్టు ప్రాంతానికి చెందిన షేక్ ఫారుక్ (37) గాల్ స్టోన్ సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తనకి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో మాజీ కార్పొరేటర్ షేక్ అబ్దుల్ ఖాదర్ ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేశారు.
మంజూరైన రూ 1 లక్ష 80 వేల
ఎల్. ఓ.సీ పత్రాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు
త్వరితగతిన ఎల్.ఓ.సీ మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితుడి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
కూటమి నేతలు షేక్ అబ్దుల్ ఖాదర్, తమ్మిన లీలా కరుణాకర్,మైలవరపు కృష్ణ, మైలవరపు మాధురి లావణ్య, తిరుపతి అనూష,ముప్పా వెంకటేశ్వరావు, బొల్లేపల్లి కోటేశ్వరరావు,కరీముల్లా, షకీర్ తదితరులు పాల్గొన్నారు.