ప్రచురణార్థం 31-07-2025
ఎమ్మెల్యే బాలకృష్ణ, బసవతారకం సీఈవో కృష్ణయ్యలను కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్
ఢిల్లీ : పార్లమెంట్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంకు గురువారం విచ్చేసిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సీ.ఈ.వో డాక్టర్ కూరపాటి కృష్ణయ్యలను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే బాలకృష్ణ రాష్ట్రాభివృద్దికి కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై చర్చించుకున్నారు.