బాబు షూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమం గుంటూరు తూర్పు నియోజకవర్గం 29వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రోషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా అధ్యక్షులు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ అంబటి రాంబాబు ,వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయ ఇన్చార్జి మరియు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ,గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ పోతిన వెంకట మహేష్, నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా మరియు కార్పొరేటర్లు సుబ్బారెడ్డి వెంకట్రెడ్డి అంబేద్కర్ ఆచార్య ,జిల్లా అధికార ప్రతినిధి ఎస్ వెంకట్ రెడ్డి రాష్ట్ర గ్రంథాలయ మాజీ చైర్మన్ శేషగిరిరావు జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ దక్షన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గుంటూరు పార్లమెంట్ అబ్సర్వర్ పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండే సిద్ధాంతాలు ఉన్నాయని పేద సామాన్య వర్గాల జీవన ప్రమాణాలను పెంచే జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం పేద సామాన్య వర్గాలను మరింత పేదలుగా చేస్తూ పెట్టుబడి దారి వర్గాలకు పారిశ్రామిక వర్గాలను అండగా నిలుస్తున్న చంద్రబాబు నాయుడు సిద్ధాంతం, ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు ప్రతి మహిళకు ఇవ్వడానికి ఈ రాష్ట్రాన్ని అమ్మిన సరిపోవని మాట్లాడుతున్నారని ఒక రూపాయికే మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని విశాఖపట్టణంలో ఉర్శ కంపెనీకి ఇవ్వడాన్ని రాష్ట్రాన్ని అమ్మడం కాదంటారా?విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్న 500 కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ స్థలాన్ని లుల్లు కంపెనీకి 99 సంవత్సరాలకి లీజ్ రాయడాన్ని రాష్ట్రాన్ని అమ్మడం కాదంటారా ?అని పవన్ కళ్యాణ్ సన్నిహితుడు టీజీ విశ్వప్రసాద్ కు 1200 ఎకరాల భూమిని రాసి ఇవ్వడాన్ని రాష్ట్రాన్ని అమ్మడం అంటారా కాదంటారో ?అచ్చం నాయుడు సమాధానం చెప్పాలని, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి మహిళల ఖాతాలో 850 రూపాయలు డిపాజిట్ సబ్సిడీ కింద జమ చేస్తారని చూస్తుంటే సినిమా టికెట్లు అమ్మకం ద్వారా ప్రతి కుటుంబంలోని సామాన్యుల వద్ద నుంచి 900 రూపాయలు లాగేస్తున్నారని, సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అదేవిధంగా నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వకపోగా నిరుద్యోగులను ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మోసం చేస్తున్నారని, ఉచిత బస్సు పథకం మొదలుపెట్టకుండానే ఆర్టీసీ స్థలాలను అక్రమంగా అన్యాయంగా విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న 500 కోట్ల రూపాయలు విలువైన ఆర్టీసీ స్థలాన్ని లులు కంపెనీకి కట్టబెడుతు ఆర్టీసీ స్థలాలను అన్యాక్రాంతం చేస్తున్నారని, రైతులకు రైతు భరోసా కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేశారని గతంలో ఈ అంశాలపై మేం కూడా జగన్మోహన్ రెడ్డి పై పలు సందర్భాల్లో మాట్లాడామని కానీ రైతుల పక్షాన నిష్పక్షపాతంగా నిజాయితీగా నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ని రైతు భరోసా పథకం అమలు చేయకుండా రైతులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ని, ఇచ్చే పెన్షన్ లో కూడా లక్షల మందికి కోత విధించారని రాబోయే రోజుల్లో పెన్షన్లలో ఎన్ని లక్షల మందికి రద్దు చేస్తారో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారని ఒక తరం మార్పు కోసం ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెడితే అదేదో నేరంలా గోరంలా ఇంగ్లీష్ మీడియం చదివితే దేశద్రోహంలా ప్రచారం చేశారని పేద సామాన్య వర్గాలు ఉన్నతంగా ఎదగకుండా ఉండే కుట్ర చేశారని పేద సామాన్య వర్గాలు మెడిసిన్ విద్య చదవాలని ఆ కుటుంబాల నుంచి డాక్టర్లుగా తయారు కావాలని జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే ఆ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటు పరం చేస్తూ మెడికల్ కాలేజ్ లను పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు అమ్మకం చేస్తూ పేద సామాన్య వర్గాల కుటుంబాల నుంచి డాక్టర్లుగా ఎవరూ ఎదగకూడదని మెడికల్ కాలేజీ లను ప్రైవేటుపరం చేస్తున్నారని పాలనను ప్రజలకు దగ్గరగా ఉంచాలని సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తే సచివాలయం వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తున్నారన్నారు.కూటమి ప్రభుత్వంలో మంత్రులు సినిమా టికెట్లు అమ్మకాలు చేస్తున్నారని ఇంకొన్ని రోజులు పోతే సైకిల్ స్టాండ్ వద్ద పార్కింగ్ టోకెన్లు కొట్టేలా ఉన్నారని పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తూ సివిల్ సప్లైస్ మీద రివ్యూ చేస్తారనుకుంటే సినిమా టికెట్ల మీద రివ్యూ చేస్తూ బుర్ర బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు.కూటమి ప్రభుత్వంలో టిడిపి జనసేన బిజెపి ఏ ఎమ్మెల్యేల కైనా సరే మా 29వ డివిజన్ కార్పొరేటర్ రోషన్ తరపున సవాల్ విసురుతున్నామని ఎందుకంటే కార్పొరేటర్ గా రోషన్ 29వ డివిజన్లో 1200 మందికి టిట్కో ఇల్లు 10000 మందికి ఇళ్ల పట్టాలు రోడ్ల నిర్మాణం డ్రైనేజ్ వర్కుల నిర్మాణంతోపాటు వార్డు అభివృద్ధి కోసం కోటిన్నర నిధులు మంజూరు చేయించారని కూటమిలో ఏ ఎమ్మెల్యే అయినా ఈ ఏడాది కాలంలో నియోజకవర్గ స్థాయిలో ఇన్ని పనులు చేయలేకపోయారని కానీ మా గుంటూరు 29వ డివిజన్ కార్పొరేటర్ రోషన్ వార్డు స్థాయిలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు చేశారని దమ్ముంటే ఎవరైనా మా కార్పోరేటర్ తో పోటీ పడే సత్తా ఉంటే ముందుకు రావాలని సవాల్ విసురుతున్నామన్నారు.