పేదల అభ్యున్నతికి కృషి ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో సుమారు రూ 40 వేలు విలువజేసే

0

పేదల అభ్యున్నతికి కృషి ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో సుమారు రూ 40 వేలు విలువజేసే

ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్

భవానిపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో పశ్చిమ లోని నిరుపేద చిరు వ్యాపారులకు ఇద్దరికీ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ , ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి టిఫిన్ బండి, మరియు తోపుడు బండిని పంపిణీ చేశారు..

ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో సుమారు రూ 40 వేలు విలువజేసే బండ్లను అడ్డూరి శ్రీరామ్,ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి వారికి అందించారు..
56 వ డివిజన్ పాత రాజరాజేశ్వరి పేటకు చెందిన అత్తలూరు రామ్మోహన్ రావు టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనోపాధి సాగిస్తునాడు
నిరుపేద ఐన రామ్మోహన్ రావు కు టిఫిన్ బండి అందజేయాలని 56 వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు నున్న కృష్ణ ఎమ్మెల్యే కార్యాలయంలో దరఖాస్తు చేయగా టిఫిన్ బండిని అందజేశారు .అదేవిధంగా 51 వ డివిజన్ నెహ్రూ బొమ్మ సెంటర్ కు చెందిన పోలవరపు చంద్రమ్మ కు తోపుడు బండిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అందులో భాగంగానే చిరు వ్యాపారులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ తోపుడుబండ్లను పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
చిరు వ్యాపారస్తులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎల్లప్పుడూ అండగా ఉంటారని అడ్డూరి శ్రీరామ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు నున్న కృష్ణ, లవిన్ బాబు, ఏలూరి సాయి శరత్, వల్లూరు మధుసూదన రావు, రేగళ్ల లక్ష్మణరావు, అలుగుండ్ల సుబ్బారెడ్డి, వేవిన నాగరాజు,మంగళపురి మహేష్ , గాయత్రి ,విజయకుమారి, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version