ఎన్డీఏ కార్యాలయంలో
ఎల్.ఓ.సీ లను అందజేసిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన
(లెటర్ ఆఫ్ క్రెడిట్)
ఎల్.ఓ.సి లను
సోమవారం భవానిపురం
ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి
ప్రత్తిపాటి శ్రీధర్ , కూటమి నేతలతో కలిసి
అందజేశారు.
55వ డివిజన్ వించి పేటకు చెందిన పీ పద్మ (65) గర్భాశయ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది .తనకి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేశారు.
మంజూరైన రూ 2లక్షల 27 వేల
ఎల్. ఓ.సీ పత్రాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు
అదేవిధంగా 50 వ డివిజన్ గొల్లపాలెం గట్టు కు చెందిన పతివాడ భూలక్ష్మి మోకిళ్ళ నొప్పులతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యవసర వైద్యం కోసం ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా రూ 2 లక్షల ఎల్. ఓ.సీ ను అందజేశారు ..
త్వరితగతిన ఎల్.ఓ.సీ మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితుల కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
కూటమి నేతలు మైలవరపు దుర్గారావు, దాడి మురళీకృష్ణ, వై విశ్వేశ్వరరావు, భావిశెట్టి శ్రీనివాస్, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు దొడ్ల రాజా, కొల్లి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.