విజయవాడ నగరపాలక సంస్థ
28-07-2025
ప్రజలకు ఎటువంటి సమస్య తలెత్తనివ్వకూడదు
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
ప్రజలకు ఎటువంటి సమస్య తెలుస్తనివ్వకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ ఎం అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం ప్రధాన కార్యాలయంలో మరియు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడైతే ఎటువంటి సమస్య తలెత్తనివ్వకుండా అధికారులు అప్రమత్తంగా ఉండు చూసుకోవాలని అన్నారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు ఫిర్యాదు చేశారు వారి దగ్గరికి వెళ్లి సమస్యను అర్థం చేసుకొని ఆ సమస్యకు అర్థవంతమైన పరిష్కారాన్ని చూపించి శాశ్వతంగా సమస్య తలెత్తకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 24 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 11, ఇంజనీరింగ్ 7, రెవిన్యూ 2, ఎస్టేట్ 2, పి ఓ యుసిడి 1, హార్టికల్చర్ 1 మొత్తం కలిపి 24 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానెట్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లత, పర్యవేక్షణ ఇంజనీర్ పి సత్యకుమారి, పి సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, బయాలజిస్ట్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.