వృద్ధురాలికి వీల్ చైర్ బహుకరణ
43వ డివిజన్, ఏకలవ్య నగర్ కు చెందిన కనుమర్లపూడి భ్రమరాంబ ( 66 ) కు భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో
వీల్ చైర్ ను బహుకరించారు
ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో తో కలిసి అందజేశారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కేంద్ర సామాజిక న్యాయ శాఖ, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకం ద్వారా వికలాంగులకు, వినికిడి సమస్యలు ఉన్నవారికి ఉపకరణాలను అందజేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని నిరూపిస్తున్నారు.
పశ్చిమ నియోజకవర్గంలోని వికలాంగులను గుర్తించి వారికి పరికరాలు అందేలా ఎన్డీఏ కూటమి నేతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
జనసేన పార్టీ 42 వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష వృద్ధురాలికి వీల్ చైర్ ను అందజేయాలని ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేయగా వీల్ చైర్ ను అందించారు.
నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు భ్రమరాంబకు వీల్ చైర్ అందించడంతో ఆవిడ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సుజనా చౌదరి కు కృతజ్ఞతలు తెలిపింది..
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు మైలవరపు కృష్ణ, మైలవరపు మాధురి లావణ్య, బొల్లేపల్లి కోటేశ్వరరావు, షేక్ అబ్దుల్ ఖాదర్, ముప్పా వెంకటేశ్వరావు,తమ్మిన లీలా కరుణాకర్, పత్తి నాగేశ్వరరావు, కరిముల్లా, షకీర్ ,తదితరులు పాల్గొన్నారు..