ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
తేదీ.02.12.2024.
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల టెంపుల్ మరియు పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నగర పోలీస్ కమీషనర్ . ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.
ది.22.09.2025 తేదీ నుండి ప్రారంభమయ్యే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 02.10.2025 తెది వరకు జరుగుతాయి. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం 11 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.
ఈ దసరా మహోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశవిదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తారన్నారు.
ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నందు నగర పోలీస్ కమీషనర్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన అధికారులు మరియు ఇతర పోలీస్ అధికారులతో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమీక్షా సమావేశంలో ది.22.09.2025 తేదీ నుండి ది.02.10.2025 తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలలో చెయు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, క్యూలైన్లలో రద్ది, స్నానఘాట్ల వద్ద రద్దీ, ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించి భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కూలంకషంగా చర్చించడం జరిగింది.
ప్రత్యేకంగా భక్తుల మనోభావాలకు అనుగుణంగా సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనం త్వరితగతిన జరిగేలా ఏర్పాట్లు చేసేందుకు, భక్తుల సౌకర్యార్థం మరియు సమాచార నిమిత్తం, వారికి మెరుగైన సౌకర్యాలు అందించడానికి వీలుగా అవసరమైన ఏర్పాట్లపై మరియు ట్రాఫిక్ నిర్వహణ మరియు బందోబస్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.తో పాటు, డి.సి.పి. . కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. తిరుమలేశ్వర రెడ్డి ఐ. పి. ఎస్, ఎస్.వి.డి ప్రసాద్, టెంపుల్ ఈ.ఓ. శ్రీనానాయక్ , ఎ.డి.సి.పి.లు జి.రామకృష్ణ .ఏ.వి.ఎల్.ప్రసన్న కుమార్ , కె.కోటేశ్వర రావు పశ్చిమ ఏ.సి.పి. దుర్గారావు ఇనస్పెక్టర్ గురు ప్రకాష్ దేవస్థాన అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.