గతంలో తాను ప్రతీ నెల ₹10 లక్షల రూపాయలు తన సొంత నిధుల నుండి వృద్ధులకు వితంతువులకు పెన్షన్లను అందించాను -MLA బొండా ఉమ

0

1-8-2025

గతంలో తాను ప్రతీ నెల ₹10 లక్షల రూపాయలు తన సొంత నిధుల నుండి వృద్ధులకు వితంతువులకు పెన్షన్లను అందించాను -MLA బొండా ఉమ

సెంట్రల్ నియోజకవర్గంలో ₹240 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాల్స్, స్కూల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, పార్కుల అభివృద్ధి చేశాం

సెంట్రల్ నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన 416 స్పోస్ పెన్షన్ల పంపిణీ చేసిన సెంట్రల్ -MLA బొండా ఉమ

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం చూడలకే జగన్ విమర్శలు చేస్తున్నాడు – MLA బొండా ఉమ

మేము రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలనుకుంటే ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఉండడు – MLA బొండా ఉమ

పులివెందులలో మీ బంధువులను అడుగు సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయో చెప్తారు -MLA బొండా ఉమ

ధి:-1-8-2025 ఈరోజు శుక్రవారం ఉదయం 11:00″గం లకు ” సింగ్ నగర్ లోని గుజ్జల సరలాదేవి కళ్యాణమండపం నందు కొత్తగా 416 స్పౌస్ పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు  “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించి స్వయంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదగా నగదు పంపిణీ చేయడం జరిగింది…

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 1,10,000 నూతన వితంతు పెన్షన్లను పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో తన నిబద్ధతను చాటుకుంటోంది అని, రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, సంక్షేమ కార్యక్రమాలను విస్మరించకుండా పేద, అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలను ఉన్నతం చేయడానికి NDA కూటమి ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది అని…

ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక కాలంలోకి వచ్చి తాను శాసనసభ్యులుగా, కేశినేని శివనాద్ (చిన్ని) విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన తర్వాత ప్రతి నెల పండుగలాగా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 1వ తారీకు ఉదయం ఆరు గంటలకల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేస్తా ఉన్నారని…

ఇదే క్రమంలో 1వ తారీకు ఆదివారం గానీ ప్రభుత్వ సెలవులు గాని ఉంటే ముందు రోజే లబ్ధిదారులకు పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం దేశంలోనే మరెక్కడా ఏ ప్రభుత్వం అందజేయలేదని ఆ ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతినెల వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఆర్థిక సహాయం కింద వితంతువులకు నెలకు ₹4,000, వికలాంగులకు రూ.6,000, పూర్తి వైకల్యం ఉన్నవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.10,000 వరకు పెన్షన్ అందిస్తున్నాం అని…

ఈ పెంచిన పెన్షన్  2024 జులై నుండి అమలులోకి వచ్చాయి, ఇది రాష్ట్రంలోని 63 లక్షల మంది లబ్ధిదారులకు ఏటా రూ.33,100 కోట్ల వ్యయంతో తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తుందని, రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, ఇకపై కూడా ప్రజా సంక్షేమం కోసం వారి సమస్యల పరిష్కారం కోసం పూర్తి బాధ్యతతో పనిచేస్తామని బొండా ఉమ హామీ ఇచ్చారు

అదే విధంగా ఆగస్టు 15వ తేదీ నుండి “శ్రీ శక్తి” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని, అధికారం అనే బాధ్యతను అహంకారంగా కాకుండా ప్రజాసేవగా భావిస్తూ ముందుకు సాగుతున్నామని…

రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్చలేకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని రాష్ట్రంలో నెల నెలా లక్షలాది మందికి పెన్షన్లు అందజేస్తు గత ప్రభుత్వ హయాంలో ‘అమ్మఒడి’ పేరుతో ఒక్క బిడ్డకు మాత్రమే లబ్ధి కలిగించారని, ప్రస్తుతం తమ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ ద్వారా ప్రతి పిల్లవాడికీ  సొమ్ము జమ చేసిందని, జగన్ మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని, పులివెందులలోనే ఆయన బంధువులను అడిగితే ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల వాస్తవ స్థితి తెలుస్తుందని, ఫ్యాక్షన్ రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని, రాజ్యాంగాన్ని పాటిస్తూ చట్టబద్ధంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని, గుడివాడ, మాచర్లలో తనను చంపేందుకు యత్నించిన వారిపై కూడా ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోలేదని, తప్పు చేసిన వారు చట్టపరంగా ఎలాంటి పరిణామాలను ఎదుర్కొవాలో ఆ దిశగా మాత్రమే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ప్రజాస్వామ్యంలో అధికారాన్ని అహంకారంగా కాకుండా బాధ్యతగా చూసుకుంటూ, సేవా దృక్పథంతో పనిచేస్తున్నామని బొండా ఉమ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో:- టిడిపి రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, సెంట్రల్ నియోజకవర్గ అబ్జర్వర్ దేవతోటి నాగరాజు, మున్సిపల్ CDO జగదీశ్వరి, ఎరుబోతు రమణారావు, బంగారు నాయుడు, బుధల సురేష్, వెలగా సురేష్, గరిమెళ్ళ నాగమణి, దాసరి ఉదయశ్రీ, ఎరుబోతు శ్రావణి, కంచి ధన శేఖర్, లబ్బా దుర్గా, మరకా శ్రీనివాస్ యాదవ్, కొమ్మినేని సురేష్, మల్లేశ్వరరావు తోపాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version