ఎమ్మెల్యే సుజనా చౌదరి

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ఎమ్మెల్యే సుజనా చౌదరి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి శ్రేణులు పనిచేయాలని మాజీ కేంద్ర మంత్రి విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు.
మంగళవారం భవానీపురం ఎన్డీయే కార్యాలయంలోప్రజలతో మమేకమయ్యారు.
కూటమి నేతలతో కలిసి మాట్లాడారు,
కూటమి ప్రభుత్వ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి సీటు ఇచ్చినా కలిసి కట్టుగా అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు
కూటమి నేతలందరం సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని కలిసిమెలిసి పనిచేయాలన్నారు.
గడచిన రెండున్నర ఏళ్లలో పశ్చిమ అభివృద్ధే లక్ష్యంగా పనిచేశానన్నారు
రానున్న రోజుల్లో అందరి సమన్వయంతో పశ్చిమాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు..
ఏపీ నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ , టీడీపీ సీనియర్ నాయకులు కోగంటి రామారావు, బొమ్మసాని సుబ్బారావు, జనసేన సెంట్రల్ ఆంధ్రా జోన్ కన్వీనర్ బాడిత శంకర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆషా, టీడీపీ మైనార్టీ నాయకులు ఫతావుల్లా,
సామాజిక వేత్త ఆకుల శ్రీనివాస్, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు
![]()
