ప్రమాదవశాత్తు మరణించిన హోంగార్డు కుటుంబాలకు రూ.10.80 లక్షల బీమా చెక్కులను అందించిన అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.

Spread the love

ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ * తేది.07-10-2026*

ప్రమాదవశాత్తు మరణించిన హోంగార్డు కుటుంబాలకు రూ.10.80 లక్షల బీమా చెక్కులను అందించిన అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.

నిరంతరం ప్రజా రక్షణకై పాటుపడే పోలీసు సిబ్బంది కుటుంబాలకు అండగా ఉండాలనే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్. నేతృత్వంలో రాష్ట్రంలోని హోంగార్డుల నుండి అన్ని కేడర్ల పోలీసు సిబ్బందికి ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించడం జరిగింది.

విజయవాడ నగర హోంగార్డు యూనిట్ నందు విధులు నిర్వహిస్తూన్న హోంగార్డు (హెచ్.జి. నెం 751) అబ్దుల్ జాని (42 సం.) ఈ సంవత్సరం మే నెలలో వర్షం పడుతున్న సమయంలో రోడ్డుపై ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టి  మరణించడం జరిగింది.  అదేవిధంగా హోంగార్డ్ (హెచ్.జి. నెం 956) జి.వి.నాగేశ్వర రావు(48 సం.)  ది.16.07.2026 తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించినారు.

ఈ సందర్భంగా ఈ రోజు పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. చేతులుమీదుగా అబ్దుల్ జాని మరియు జి.వి.నాగేశ్వర రావు కుటుంబ సభ్యులకు బీమా క్లెయిం రూ.10,80,000 /- చొప్పున చెక్కు లను అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అడ్మిన్ డి.సి.పి.  కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్ తో పాటు, హోంగార్డు ఆర్.ఐ.  సుధాకర రెడ్డి  ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం. సోమయ్య ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ తదితరులు పాల్గొన్నారు.

Loading