సామాన్య భక్తులకు శీఘ్రదర్శనమే లక్ష్యం ఎమ్మెల్యే సుజనా చౌదరి

సామాన్య భక్తులకు త్వరితగతిన కనక దుర్గమ్మ అమ్మవారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు..ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్,
ఈ ఓ సీనా నాయక్, ఆలయ చైర్మన్ బొర్రా రాధ కృష్ణ గాంధీ సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ 2026 దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు సులభమైన శీఘ్ర దర్శనమే ఏకైక లక్ష్యంగా అందరి సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.. భక్తులందరికీ సమాన దర్శన అవకాశం కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న ప్రత్యేక దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేశామని క్యూలైన్ల ద్వారా భక్తులందరూ ఉచితంగానే అమ్మవారిని దర్శించుకోవచ్చని తెలిపారు.ఆలయంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను పూర్తిగా నిషేధించి, భక్తుల కోసం వాటర్ బబుల్స్ ఏర్పాటు చేసి మంచినీటిని అందిస్తున్నామన్నారు అధికారులందరి సమన్వయంతో దసరా ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు
![]()
