వాల్మీకి మహర్షి జయంతి సందర్బముగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.

Spread the love

ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.
ది.26.10.2026.

వాల్మీకి మహర్షి జయంతి సందర్బముగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.

ది.26.10.2026వ తేదీన వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా నగర పోలీస్ కమీషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ జిల్లా కలెక్టర్  లక్ష్మి శా ఐ.ఎ.ఎస్. మరియు ఇతర అధికారులతో కలిసి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. 

అదేవిధంగా పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి చిత్రపటానికి డిప్యూటి పోలీస్ కమీషనర్ కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్.పూలమాలలు వేసి, ఘనంగా నివాళి అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగాపోలీస్ కమీషనర్  మాట్లాడుతూ.... వాల్మీకి మహర్షి ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామాయణ మహాకావ్యంను సంకలనం చేసినారని, యుగాలు మారినా చెక్కుచెదరని కుటుంబ విలువలు, ధర్మం, మానవ సంబంధాలను బోధించే ఉన్నతమైన ఆదర్శ కావ్యంగా రామాయణాన్ని వాల్మీకి మహర్షి సమాజానికి అందించారు. వేటగాడు రత్నాకరుడు, మహర్షి వాల్మీకిగా మారిన వృత్తాంతం మనిషిలో మార్పు వస్తే మహర్షి కాగలరు అని నిరూపించింది. ఈ మహనీయుని జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని జీవితంలో ధర్మబద్ధంగా, ముందుకు సాగాలి. రామాయణం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కుటుంబ, మానవతా విలువలను పెంపొందించుకోవాలని మరియు ధర్మబద్ధంగా జీవించాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. తోపాటు, డిప్యూటి పోలీస్ కమీషనర్  కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్ని వాల్మీకి మహర్షి  చిత్రపటానికి నివాళులు అర్పించారు.

Loading