భారీగా తెలుగుదేశం పార్టీలో చేరిన ఎస్.కే. ఖాజా, చెపుల ఆంజనేయులు

Spread the love

భారీగా తెలుగుదేశం పార్టీలో చేరిన ఎస్.కే. ఖాజా, చెపుల ఆంజనేయులు

రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నికి చెందిన నాయకులు 200 మందితో టీడీపీలో చేరిక

పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో ఘనంగా చేరికల కార్యక్రమం

మంగళగిరి: తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భారీగా పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది.
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఎస్.కే. ఖాజా ప్రముఖ పారిశ్రామికవేత్త చెపుల ఆంజనేయులు తమ అనుచరులతో కలిసి సుమారు 200 మందితో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో పార్టీకి మరింత బలం
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరింది. ఎస్.కే. ఖాజా చెపుల ఆంజనేయులు తమ అనుచరులతో కలిసి పార్టీలో చేరడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా ముందుకు సాగుతోందని, పార్టీ నాయకత్వంపై విశ్వాసంతో వివిధ వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరడం శుభపరిణామమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు తెలిపారు.
పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బిసి, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ రాష్ట్ర వాక్ఫ్ బోర్డ్ చైర్మన్ SK అబ్దుల్ అజీజ్ గ్రంధాలయ చైర్మన్ MS బేగ్ మరియు వివిధ డివిజన్ల అధ్యక్షులు, నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Loading