ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
ది.08.10.2026
నగరంలోని అన్ని పార్టీల వివిద రంగాలకు చెందిన సంస్థలు, స్వచ్చంద సంస్థలు మరియు అన్ని యూనియన్స్ వారితో సమావేశం నిర్వహించిన అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్

అక్టోబర్ 11 నుంచి 20 వరకు విజయవాడ నగరంలో అత్యంత వైభవంగా జరిగే దసరా శరన్నవరాత్రులు మరియు విజయవాడ ఉత్సవ్ 2.0, పున్నమి ఘాట్‌లో జరుగు జాతీయ సరస్ మేళా కార్యక్రమాలను పురస్కరించుకుని ఈ రోజు పోలీసు కమిషనర్ వారి కార్యలయం నందు ఎన్.టి.ఆర్.పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. అధ్యక్షతన విజయవాడ నగరంలోని అన్నీ రాజకీయ పార్టీలు, వివిద రంగాలకు చెందిన సంస్థలు, స్వచ్చంద సంస్థలు మరియు అన్ని యూనియన్స్ ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ నేపధ్యంలో అడ్మిన్ డి.సి.పి. మాట్లాడుతూ..... గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గతంలో వినియోగించిన అత్యాధునిక టెక్నాలజీ తోపాటు బూమ్ బ్యారియర్లు, యాక్సెస్ కంట్రోలర్స్ వంటి వాటిని కూడా ఏర్పాటు, భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండే విధంగా హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేస్తూ నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో పటిష్టమైన బంధోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.
ఈ ఉత్సవాల సమయంలో గౌరవ రాష్ట్రపతి , ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల వంటి అతిముఖ్య వ్యక్తుల (VVIP) పర్యటనలు, భక్తుల భద్రత మరియు శాంతిభద్రతల దృష్ట్యా పోలీసు యంత్రాంగం, సిబ్బంది అందరూ బందోబస్తు విధుల్లోనే ఉంటారు. కావున అక్టోబర్ 9వ తేదీ నుండి అక్టోబర్ 21వ తేదీ వరకు ఎలాంటి నిరసనలు, ఆందోళనలు లేదా ర్యాలీలు నిర్వహించకుండా, తమ తమ సంస్థాగత/రాజకీయ కార్యక్రమాలను, ర్యాలీలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని, పోలీస్ వారికి సహకరించాలని కోరారు.
ఈసందర్బంగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతినిధులు దసరా మహోత్సావాలలో ఏర్పాట్లలో బాగంగా పలు సమస్యలను లేవనెత్తి, కొన్ని సలహాలు మరియు సూచనలు చేయడం జరిగింది.
ఈ సంధర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ ….. నగరంలో సి.సి.కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను అదుపులోనికి తీసుకు వచ్చారని, అదే విధంగా ఆదునిక సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకుని తక్కువ సమయంలో నేరస్తులను గుర్తించి వారిని అరెస్టు చేయడంతోపాటు బాధితులకు స్వాంతన చేకూరేలాగా చర్యలు తీసుకొంటున్నారని, సైబర్ నేరాలను జరుగకుండా అన్ని విధాలుగా ప్రజలకు అవగాహన కల్పించి విజయవాడ నగరంలో సైబర్ నేరాలు జరగకుండా కట్టడి చేశారని కొనియాడారు. అదే విధంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను, విజయవాడ ఉత్సవ్ 2.0, జాతీయ సరస్ మేళా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని, దానికోసం పోలీసు వారికి పూర్తిగా సహకరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమాలు ఘనంగా జరగడాని తమ వంతు సహకారంగా స్వచ్చంధంగా పాల్గొని సేవలు అంధిస్తామని తెలియజేశారు.
ఈ నేపధ్యంలో అడ్మిన్ డి.సి.పి. ఆ సమస్యలు మరియు ఇచ్చిన సూచనలను అధికారులతో చర్చించి త్వరిగతగతిన వాటిని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినారు.
ఈ కార్యక్రమంలో డి.సి.పి. అడ్మిన్ కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.తో పాటు, ఎస్.బి. ఏ.సి.పి. భాను ప్రకాష్ రెడ్డి ఇన్స్పెక్టర్లు పి. కనకారావు బాల రాజాజీ అన్నీ రాజకీయ పార్టీలు, వివిద రంగాలకు చెందిన సంస్థలు, స్వచ్చంద సంస్థలు మరియు అన్ని యూనియన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
![]()
