పోర్టుల అభివృద్ధికి 20 వేల ఎకరాల ఉప్పు భూములు ఇవ్వండి

Spread the love

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

పోర్టుల అభివృద్ధికి 20 వేల ఎకరాల ఉప్పు భూములు ఇవ్వండి

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, అక్టోబరు 08: రాష్ట్రంలో పోర్టుల ఆధారిత పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సుమారు 20,378 వేల ఎకరాల ఉప్పు భూములను రాష్ట్రానికి బదలాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో జరిగిన భేటీలో సీఎం ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో పోర్టుల విస్తరణ, అనుబంధ మౌలిక వసతుల అభివృద్ధికి ఈ భూములను వినియోగించుకునేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీపీఐఐటీ ఆధీనంలో ఉన్న 20,378 ఎకరాల ఉప్పు భూములను పోర్టు ఆధారిత పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం కేటాయించాలని ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పెట్టినట్టు ముఖ్యమంత్రి వివరించారు. పోర్టులకు అవసరమైన అనుసంధాన రహదారులు, రైల్వే మార్గాలు, పారిశ్రామిక కార్యకలాపాలకు అనువైన భూమి అందుబాటులో ఉండటం కీలకమని వివరించారు.

వాణిజ్య పంటలకు అండగా నిలవాలి

ఏపీలో రైతులు పండిస్తున్న వాణిజ్య పంటలకు మెరుగైన మార్కెట్‌ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో మిర్చి, పొగాకు, ఆక్వా తదితర వాణిజ్య పంటలకు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఆయా ఉత్పత్తుల ఎగుమతులకు అవసరమైన మార్కెట్‌ లింకేజీలు, మౌలిక వసతులు, నాణ్యత ప్రమాణాలు, ప్రాసెసింగ్‌ సదుపాయాలను బలోపేతం చేయడానికి కేంద్రం సహకరించాలని కోరారు.పోర్టుల అభివృద్ధికి 20 వేల ఎకరాల ఉప్పు భూములు ఇవ్వండి

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, అక్టోబరు 08: రాష్ట్రంలో పోర్టుల ఆధారిత పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సుమారు 20,378 వేల ఎకరాల ఉప్పు భూములను రాష్ట్రానికి బదలాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో జరిగిన భేటీలో సీఎం ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో పోర్టుల విస్తరణ, అనుబంధ మౌలిక వసతుల అభివృద్ధికి ఈ భూములను వినియోగించుకునేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీపీఐఐటీ ఆధీనంలో ఉన్న 20,378 ఎకరాల ఉప్పు భూములను పోర్టు ఆధారిత పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం కేటాయించాలని ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పెట్టినట్టు ముఖ్యమంత్రి వివరించారు. పోర్టులకు అవసరమైన అనుసంధాన రహదారులు, రైల్వే మార్గాలు, పారిశ్రామిక కార్యకలాపాలకు అనువైన భూమి అందుబాటులో ఉండటం కీలకమని వివరించారు.

వాణిజ్య పంటలకు అండగా నిలవాలి

ఏపీలో రైతులు పండిస్తున్న వాణిజ్య పంటలకు మెరుగైన మార్కెట్‌ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో మిర్చి, పొగాకు, ఆక్వా తదితర వాణిజ్య పంటలకు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఆయా ఉత్పత్తుల ఎగుమతులకు అవసరమైన మార్కెట్‌ లింకేజీలు, మౌలిక వసతులు, నాణ్యత ప్రమాణాలు, ప్రాసెసింగ్‌ సదుపాయాలను బలోపేతం చేయడానికి కేంద్రం సహకరించాలని కోరారు.

Loading