“అర్నబ్” తుఫాన్ నేపథ్యంలో పోలీసుల తక్షణ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.

Spread the love

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ. తేదీ. 28 -10-2026.

“అర్నబ్” తుఫాన్ నేపథ్యంలో పోలీసుల తక్షణ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.

ఘటనపై తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టిన మాచవరం పోలీసులు.

‘అర్నబ్’ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నగర పోలీస్ కమిషనర్  ఎస్. వి. రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్.  పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన ఏర్పాట్లపై నిరంతరం పర్యవేక్షించినారు . 

వర్షాల కారణంగా కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలను అప్రమత్తం చేస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేవిధంగా చర్యలు చేపట్టడం జరిగింది.

ఈ క్రమంలో మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుణదల, విజయనగర కాలనీ కొండపై నివాసముంటున్న బండ్రపల్లి వెంకటేశ్వరరావు (49) అనే వ్యక్తికి చెందిన రేకుల షెడ్డు ఇల్లు రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు తడిసి ఈరోజు మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో కూలిపోయింది

పోలీస్ శాఖ ముందస్తుగా జారీ చేసిన హెచ్చరికలతో అప్రమత్తమైన కొండ ప్రాంత నివాసితులు మరియు పోలీసులు చేపట్టిన చర్యల వల్ల, ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పి అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే మాచవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, బాధితులకు అవసరమైన రక్షణ చర్యలు అందించారు.

“తుఫాన్ ప్రభావం తగ్గేవరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు పోలీసు మరియు యంత్రాంగం ఇచ్చే సూచనలను పాటించి సహకరించాలి. ఏ క్షణంలోనైనా సహాయం కోసం డయల్ 112 లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపినారు.

Loading