
విజయవాడ ఉత్సవ్–2.0 డే–2 వేడుకలు ఘనంగా నిర్వహణ
ప్రజలను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షోలు
వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు, యువ నాయకులు బొండా సిద్ధార్థ
విజయవాడ నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతూ, బెజవాడ సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్–2.0 డే–2 వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన లైవ్ బ్యాండ్ సంగీతం, గర్బా ఫ్యూజన్ నృత్యాలు, ఆకట్టుకునే లేజర్ షోలు, క్రాకర్ షో ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అదేవిధంగా మన సంప్రదాయ కళారూపాలైన హరికథ, తోలుబొమ్మలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగీతం, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో స్టేడియం సందడిగా మారింది.
విజయవాడ నగర ప్రజలు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఆస్వాదించారు. బెజవాడ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా విజయవాడ ఉత్సవ్–2.0 నిర్వహించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది.
విజయవాడ నగరానికి సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తూ, స్థానిక కళాకారులు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం కల్పించే ఈ ఉత్సవాలు నగర ప్రతిష్ఠను మరింత పెంచేలా నిలిచాయి.
![]()
