శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న విశాఖపట్నం ఎంపీ భరత్

Spread the love

శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న విశాఖపట్నం ఎంపీ భరత్.

ఇంద్రకీలాద్రి (విజయవాడ), 12 అక్టోబర్ 2026:
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ సోమవారం ఉదయం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసి,
శ్రీ గాయత్రీ దేవి దివ్యాలంకారంలో కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దసరా శరన్నవరాత్రుల వేళ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే ఉత్సవాల్లో భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ ఎంతో ప్రశంసనీయంగా ఉన్నాయని ఆలయ యంత్రాంగాన్ని అభినందించారు.

Loading