
భవానిపురంలో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన పౌరసరఫరాల శాఖామంత్రి నాదెళ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం విజయవాడ , భవానీపురం రైతు బజారులో ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ సన్నబియ్యం విక్రయాలను ప్రారంభించారు.
ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయ భాను,పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ కన్న బాబు, జాయింట్ కలెక్టర్ ఇలక్కియ తో కలిసి ప్రారంభించారు
ఈ సందర్భంగా నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్ లో పెరుగుతున్న నిత్యవసరాల ధరల నుండి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు
ఇప్పటికే రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా BPT రకం సన్నబియ్యాన్ని అందిస్తున్నామని దానికి అదనంగా నేటి నుండి కే ఎన్ ఎం/ ఆర్ ఎన్ ఆర్ రకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
వినియోగదారులకు 26 కిలోల బ్యాగ్‌లలో లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు.
బహిరంగ మార్కెట్లో నాణ్యమైన సన్న బియ్యం ధర కిలో రూ. 90 వరకు ఉన్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నిర్ణయం సామాన్యులకు భారీ ఆర్థిక ఊరట నిస్తుందన్నారు.
ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..
జనసేన నాయకులు మరుపిళ్ళ రాజేష్ , మహాదేవు అప్పాజీరావు, పెటేటి నాంచారయ్య,
ఎ ఎస్ యన్ మూర్తి,
తిరుపతి అనూష, తిరుపతి సురేష్, మల్లేపు విజయలక్ష్మి,
బొల్లేపల్లి కోటేశ్వరరావు, బొమ్ము రాంబాబు, బొమ్ము గోవిందమ్మ, రెడ్డిపల్లి అనిత,మద్దిల రామక్రిష్ణ ,
వెంపలి గౌరీ శంకర్, ఏలూరి సాయి శరత్, రౌతు వాసు, పల్లంటి ఆది తదితరులు పాల్గొన్నారు
![]()
