
గుణదలలో నూతన హంగులతో ‘స్వీట్ వే కేక్స్’ ప్రారంభం
విజయవాడ (ఉదయతార): వివిధ రకాల కళాత్మక డిజైన్లతో కనులవిందు చేసే రుచికరమైన కేకుల తయారీకి పెట్టింది పేరైన ‘స్వీట్ వే కేక్స్’ (Sweet Way Cakes) సరికొత్త మార్పుతో గుణదలలో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ బేకరీ షోరూమ్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ అద్దంకి అయ్యప్ప మణికంఠ విలేకరులతో మాట్లాడుతూ
పదేళ్ల సుదీర్ఘ అనుభవంతో విజయవాడలో ఎక్కడా దొరకని, కేవలం మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే లభించే అరుదైన ఫ్రూట్ కేక్స్ మరియు యానిమల్ థీమ్ కేకులను ఇక్కడ అందిస్తున్నామన్నారు.
అన్ని రకాల వేడుకలకు కావలసిన స్పెషల్ కేకులు ఆర్డర్ కోసం వేచి చూడకుండానే అప్పటికప్పుడు కౌంటర్లో సిద్ధంగా ఉంటాయని తెలిపారు.
వివాహాలు, ఇతర శుభకార్యాలకు వంద మంది నుండి పది వేల మంది వరకు డెజర్ట్‌లను ఆర్డర్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తామని వెల్లడించారు.ఆరోగ్యకరమైన బేకరీ ఉత్పత్తులు: బేకరీ పదార్థాలు అంటే కేవలం మైదాపిండితో చేస్తారనే అపోహను తొలగిస్తూ ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఓట్స్, రాగి పిండి, గోధుమ పిండి, అరటిపండు, బెల్లం మరియు ఖర్జూరంతో తయారుచేసిన ఉత్పత్తులను అందిస్తున్నట్లు చెప్పారు.స్పెషల్ ఐటమ్స్: ఆల్మండ్ కుకీస్, ప్రోటీన్ బ్రెడ్ మరియు ప్రోటీన్ కేక్ తమ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అయ్యప్ప మణికంఠ పేర్కొన్నారు. మొగల్రాజపురం, గన్నవరం,ఏలూరు కాకినాడ ,ఫ్రాంచైజీలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా విభిన్న ఆకృతులలో నాణ్యమైన, రుచికరమైన ఉత్పత్తులను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అద్దంకి, అంజేష్ కుమార్, మిత్రులు శ్రేయోభిలాషులు బంధువులు, సిబ్బంది పాల్గొన్నారు
![]()
