స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా ఎంపీ కేశినేని చిన్ని విస్తృత పర్యటనలు

Spread the love

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా ఎంపీ కేశినేని చిన్ని విస్తృత పర్యటనలు

పశ్చిమ నియోజకవర్గంలోని 43, 56, 57, 58వ డివిజన్ల నాయకులతో ప్రత్యేక సమావేశం

వార్డుల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కార్పొరేటర్ అభ్యర్థులకు సూచన

విజయవాడ( పశ్చిమ నియోజకవర్గం ) స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విస్తృత పర్యటనలు, సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 43, 56, 57, 58వ డివిజన్ల నాయకులతో ఎంపీ చిన్ని ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో ఎన్నికల ప్రచార సరళి, స్థానికంగా ఉన్న సమస్యలు, ప్రజల అవసరాలపై నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులతో చర్చించారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన్యత

వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ కేశినేని చిన్ని కార్పొరేటర్ అభ్యర్థులకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చే సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.

ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలి

కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఎంపీ చిన్ని పిలుపునిచ్చారు. కూటమిలో ఏ పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధించినా, ఆ విజయం కూటమి విజయంగానే భావించాలని సూచించారు.

పార్టీల మధ్య సమన్వయం, నాయకుల మధ్య ఐక్యత, కార్యకర్తల సమష్టి కృషి కూటమి విజయానికి కీలకమని పేర్కొన్నారు. ప్రతి డివిజన్‌లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని కోరారు.

43వ డివిజన్ ప్రజల సమస్యలపై ఎంపీ చిన్ని హామీ

43వ డివిజన్ పరిధిలోని వీఎంసీ కాలనీ ప్రజలు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ఎంపీ కేశినేని చిన్ని దృష్టికి తీసుకువచ్చారు. అలాగే రాజీవ్ శర్మ నగర్, కేఎల్ నగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.

ఈ సమస్యలపై స్పందించిన ఎంపీ కేశినేని చిన్ని, ప్రజల విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రజల సమస్యలను పరిష్కరించడం, స్థానిక ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, ఆకుల రాఘవేంద్రరావు, గుర్రం కనకదుర్గ, గుర్రం కొండ, అశోక్, కొట్టేటి రమణ, బొడ్డు నాగలక్ష్మి, అన్నం సాయి సునీత,ఆయా డివిజన్ల నాయకులు, కూటమి పార్టీల ప్రతినిధులు, కార్పొరేటర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Loading