
ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
తేదీ. 27-10-2026.
పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలలో బాగంగా అమరుల కుటుంబాలతో సమీక్షా సమావేశం నిర్వహించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు -2026 కార్యక్రమంలో బాగంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను స్మరించుకుంటూ ఈ రోజు పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., ఆధ్యక్షతన ఎన్.టి.ఆర్.జిల్లా నందు విధులు నిర్వహిస్తూ అసువులు బాసిన పోలీసు అదికారులు, సిబ్బంది యొక్క కుటుంబాల వారితో వారికి రావాల్సిన బెనిఫిట్స్ బకాయిలపై సమీక్షా సమావేశం నిర్వహించి కూలంకషంగా చర్చించడం జరిగింది.
ఈ క్రమంలో అమరవీరుల కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి, ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ద్వారా అమరవీరుల కుటుంబాలకు అందాల్సిన సదుపాయాలు, సంక్షేమ ప్రయోజనాలు (Benefits) అన్నీ సక్రమంగా అందాయా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇంకా ఏవైనా బకాయిలు లేదా ప్రయోజనాలు అందాల్సి ఉంటే వాటిని వెంటనే అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ.... "కష్టపడి ప్రాణాలకు తెగించి పనిచేసే నిబద్ధత కలిగిన సిబ్బందిని/అధికారులను కోల్పోవడం చాలా బాధాకరమని, విధి నిర్వహణలో వారు చేసిన సేవలు, కష్టపడే తత్వం ఎప్పటికీ మరవరానివని, అమరవీరుల త్యాగాలు పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని, వారి కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగాఉంటుందని, "పోలీస్ డ్యూటీ అత్యంత కష్టతరమైనది, బాధ్యతాయుతమైనదని. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల రక్షణ, విపత్తులు మరియు అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించడం, పండుగలు, ఎన్నికలు, రాత్రింబవళ్లు విధులు నిర్వహించడం వంటి బాధ్యతలను పోలీసులు నిర్వర్తిస్తారని. కుటుంబాలకు దూరంగా ఉండి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజా భద్రత కోసం పనిచేస్తున్న పోలీసుల సేవలు అభినందనీయం అని తెలిపారు.
అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు -2026 జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. , ఎ.ఆర్.ఎ.డి.సి.పి. ఎన్.వి.రమణ ఎ.ఆర్.ఎ.సి.పి. ప్రేమ కుమార్ సి.టి.సి.ఎ.సి.పి. ఉమా మహేశ్వర రెడ్డి ఏ.ఏ.ఓ.మహమ్మద్ ఇల్లియాస్ అహ్మద్ వెల్ఫేర్ ఆర్.ఐ. శ్రీనివాస రావు పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోమయ్య సి.పి.ఓ. పరిపాలనా విభాగ సిబ్బంది చనిపోయిన పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
![]()
