
జనసేనలోకి వైసీపీ నాయకులు
- కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు సోమవారం జనసేన పార్టీలో చేరారు. కాకినాడలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దాపురం నియోజకవర్గం, నవర గ్రామానికి చెందిన మాజీ సర్పంచులు దమ్మాల లక్ష్మణరావు, చిక్కాల నూకరాజు, చంద్రమాంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురుమెళ్ల లోవరాజు, వైసీపీ నాయకులు కురుమెళ్ల లక్ష్మణదొర, పంపన రామకృష్ణ, బలగం ప్రసన్న కుమార్, యల్ల వీర వెంకట సుబ్బారావు, పెంకే శ్రీలక్ష్మి సత్తిబాబు, పెంకే సత్తిబాబు, వెలుగుబంట్ల నారయ్య, బి. హనీష్ కుమార్, శ్రీ పంపన వెంకట రమణ, వై. శ్రీనివాస్ తదితరులు జనసేనలో చేరిన వారిలో ఉన్నారు. కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో వీరంతా జనసేన పార్టీలో చేరారు.
![]()
