
“సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన .
పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ ఎమ్మెల్యే
సుజనా చౌదరి గారు “సుజనా ఫౌండేషన్” ద్వారా ప్రతి వారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది.
చిట్టి నగర్, సర్కిల్ వన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శనివారం నిర్వహించిన “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు.
ఈ వైద్య శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు , ఈ సీ జీ, 2డి ఎకో, ఎక్స్ రే, బీ పీ, షుగర్ వంటి రక్త పరీక్షలతో పాటు జనరల్ ఫిజీషియన్స్ వైద్య సేవలందించారు.
కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరం లో 122 మందికి నిపుణులైన వైద్యుల బృందం ప్రత్యేక శ్రద్ధతో చికిత్సలు అందించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
హెల్ప్ హాస్పిటల్ వైద్యులు, పిన్నమనేని సిద్ధార్థ డెంటల్ కళాశాల వైద్యులు , అమరావతి ఐ హాస్పిటల్ వైద్యులు ,సుజనా మిత్రా కోఆర్డినేటర్లు ,సుజనా ఫౌండేషన్ సిబ్బంది , కూటమి నేతలు నాగోతి రామారావు, కోటేశ్వరరావు, శ్రీను, దినవాహిని ట్రస్ట్ బోర్డు చైర్మన్ పైలా నరసింహారావు , జనసేన నేత వేంపలి గౌరీ శంకర్ తదితరులు ఈ శిబిరంలో తమ సేవలందించారు.
![]()
