మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ను ఇటీవలె ప్రారంభించారు. ఈ సినిమా కోసం ఇండియాలోని స్టార్ క్యాస్ట్ అంతా రాబోతోంది. టాప్ టెక్నీషియన్స్ అంతా కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. అయితే ‘కన్నప్ప’ మూవీకి ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా రంగంలోకి దిగాడు. ఈ సినిమాలోని పాటలకు ప్రభు దేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఈ మేరకు న్యూజిలాండ్‌లో ప్రభుదేవాకు కన్నప్ప టీమ్ స్వాగతం పలికింది.
ప్రభుదేవా ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘కన్నప్ప’ సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. అనేక పాటలకు కొరియోగ్రఫీని కంపోజ్ చేసే పనిలో ఉన్న ప్రభుదేవా రాకతో కన్నప్ప సినిమా మరో లెవెల్‌కు వెళ్లింది. ప్రభుదేవా కొరియోగ్రఫీ ఎలక్ట్రిఫైయింగ్ సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుంది. రెండో షెడ్యూల్ న్యూజిలాండ్‌లో ప్రారంభమైందని ‘కన్నప్ప’ మూవీ టీం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో సినిమాను షూట్ చేస్తున్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ తదితరులు నటిస్తున్నారు. ‘మహాభారతం’ సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు.
Spread the love ప్రతిక్షణం ప్రజల కోసం ప్రతి అడుగు పెనమలూరు నియోజకవర్గం అభివృద్ధి వైపు ఉయ్యూరు పట్టణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్ ఉయ్యూరు ఈ రోజు(07/05)న పట్టణంలో ఎన్నికల ప్రచార […]
Spread the love పశ్చిమ లో కేశినేని నాని, షేక్ ఆసిఫ్ ల ఎన్నికల ప్రచారం జనసంద్రంతో కిక్కిరిసిన రోడ్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, రథం సెంటర్ వద్ద నుంచి చిట్టినగర్ వరకు రోడ్ షో […]
Spread the love కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్పపై లైంగిక దాడి ఆరోపణలతో తాజాగా కేసు నమోదైంది. 17 ఏళ్ల మైనర్ బాలిక, ఆమె తల్లి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని […]