ఢిల్లీలోని భారత్ మండపంలో శుక్రవారం జరిగిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీ చేసిన ఒక పని అందిరి హృదయాలను గెలుచుకుంది. విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తున్న సమయంలో ఓ మహిళ వేదికపైకి వచ్చారు. ఆమె వచ్చి ప్రధాని మోదీ కాళ్లు మొక్కారు. అంతే.. అది చూసిన ప్రధాని వెంటనే ఆ మహిళ కాళ్లకు తనూ నమస్కరించారు.
‘మీ కళా ప్రపంచంలో గురువుల కాళ్లకు నమస్కరించడం సహజం. కానీ, రాజకీయాలలో ఇలా చేస్తే దానికి చాలా అర్థాలు చెబుతారు’ అన్నారు ప్రధాని. ఇక తన విషయానికి వస్తే ఎవరైనా తన కాళ్లకు మొక్కితే.. తనకు ఏదోలా ఉంటుందన్నారు. ఇంకా చెప్పాలంటే తనకు అసలు నచ్చదని చెప్పుకొచ్చారు. మోదీ చేసిన ఈ పనిపై ఇప్పుడు నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇదిలాఉంటే.. దేశంలోని సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా ఇకపై మంచి గుర్తింపు లభించనుంది. ఎందుకంటే వారి కోసమే మొదటిసారిగా ఈ ‘నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్’ను తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా శుక్రవారం పలువురు సోషల్ మీడియా క్రియేటర్లకు అవార్డులు అందజేయడం జరిగింది.
Spread the love దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ వ్యాపార సంస్థ మహీంద్రా గ్రూప్ హైదరాబాదులో నాలుగేళ్ల కిందట మహీంద్రా యూనివర్సిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో 35 రకాల యూజీ, […]
Spread the love ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ స్పందించారు. ఏం చేయాలనే దానిపై ఇండియా కూటమిలోని పార్టీలన్నీ […]
Spread the love రాయల్ బ్రిస్బేన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వేమూరు ఉజ్వల ఈ నెల 2న స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన వైనం ప్రమాదవశాత్తూ కాలు జారడంతో లోయలో పడి దుర్మరణం మృతదేహాన్ని భారత్‌కు […]