స్వచ్ఛాంధ్ర అవార్డు అందుకున్న జెడ్పీ CEO డా. జె. అరుణ/
NTR జిల్లలో స్వచ్చ రధం అవార్డులు పంట/
ఉమ్మడి జిల్లాలోని స్వచ్చ రధంనకు రాష్ట్ర మరియు జిల్లా అవార్డులు

ఎన్టీఆర్ జిల్లాలో స్వచ్ఛత కార్యక్రమాల అమలు మరియు ఉత్తమ పనితీరుకు గాను జిల్లా స్థాయి స్వచ్చ రథం స్వచ్ఛత బెస్ట్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో జిల్లా పరిషత్ సీఅ.ఈ.ఓ డా. జె. అరుణ కి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుండి స్వచ్చత అవార్డు లభించింది.
తుమ్మల పల్లి కళాక్షేత్రం నందు ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డ్ ల ప్రాదానోత్సవం కార్యక్రమములో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. లక్ష్మిషా, చేతులు మీదగా డా. జె. అరుణ షీల్డ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉమ్మడి కృష్ణా జిల్లలో భాద్యతలు చేపట్టి ఆనాతి కాలములోనే స్వచ్ఛత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భముగా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రశంచినారు
![]()
