అమరావతి

• వివిధ శాఖలు అందిస్తున్న పౌర సేవలపై సీఎం చంద్రబాబు సమావేశం.
• ప్రభుత్వ ఉద్యోగులకు సామర్ధ్యం పెరిగితే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్న సీఎం చంద్రబాబు.
• రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్షేత్రస్థాయి సిబ్బంది, ఉద్యోగులతో త్వరలో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడి.
• కెపాసిటీ బిల్డింగ్ సహా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం శాఖలు సిద్దం కావాలన్న సీఎం చంద్రబాబు.
• కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, మిషన్ కర్మయోగి పోర్టల్, ఉన్నతి ద్వారా ఆన్ లైన్ కోర్సులను ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్న ముఖ్యమంత్రి
• 4200 కోర్సులను పూర్తి చేసిన ఓ ఎస్జీటీ టీచర్ తన సామర్ధ్యాలను పెంచుకున్నారని తెలిపిన సీఎం చంద్రబాబు.
• ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ కోర్సులు నేర్చుకునేలా ఐఐఎం, ఐఐటీలు, యూనివర్సిటీల్లోనూ శిక్షణ తీసుకోవాలని సూచించిన సీఎం.
• సమీక్షకు హాజరైన రెవెన్యూ ఐటీ, ఆర్ధిక, మహిళా శిశు సంక్షేమం, స్కిల్ డెవలప్మెంట్, ఐ అండ్ ఐ, సెర్ప్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు.
![]()
