మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

Spread the love

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన (లెటర్ ఆఫ్ క్రెడిట్) ఎల్ ఓ సీ లను కూటమి నేతలు భవానిపురం , ఎన్డీయే కార్యాలయంలో బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు ..

కామకోటి నగర్ కు చెందిన మట్టా వెంకట సత్యవతి (41) ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 8 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు

40 వ డివిజన్ ,కోళ్ల ఫారం రోడ్డుకు చెందిన కే విజయ రాధిక (48) క్యాన్సర్ చికిత్స కొరకు రూ 11 లక్షల విలువైన ఎల్ ఓ సీ అందజేశారు.

పూర్ణానందంపేటకు చెందిన పీ నాగమణి(53) మోచేతి శస్త్ర చికిత్స నిమిత్తం మంజూరైన రూ 3.78 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు

47 వ డివిజన్, డీ నీరజకు తన రెండు రోజుల నవజాత శిశువు అత్యవసర వైద్యం కోసం రూ 8.45 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను కూటమి నేతలు అందజేశారు..

త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు..

మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ , కూటమి నేతలు పీ వీ చిన సుబ్బయ్య, పచ్చి పులుసు వెంకట శివప్రసాద్, మన్నం నారాయణ, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Loading