సుందరయ్య నగర్‌లో ఘనంగా ఎన్టీఆర్ ఆవిష్కరణ.. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

Spread the love

సుందరయ్య నగర్‌లో ఘనంగా ఎన్టీఆర్ ఆవిష్కరణ.. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

ధి :-29-9-2026 ఈరోజు మంగళవారం సాయంత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ సుందరయ్య నగర్ మసీద్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమ మాట్లాడుతూ:- ఎన్టీఆర్ తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని, పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల కోసం రాజకీయాల్లో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మహానేత ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి తెలుగుదేశం కార్యకర్త బాధ్యత అని అన్నారు.

ఎన్టీఆర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

సుందరయ్య నగర్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ విగ్రహం రాబోయే తరాలకు ఎన్టీఆర్ సేవలను, ఆశయాలను గుర్తు చేసేలా నిలుస్తుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

ఈ కార్యక్రమంలో:- 63వ డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను, ఇంచార్జ్ మోత్కూరి కాసిం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు , కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Loading