హై కోర్టు తీర్పుని వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ని, డీజీపీ హరీష్

0

హై కోర్టు తీర్పుని వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి  ముకేశ్ కుమార్ మీనా ని, డీజీపీ  హరీష్ కుమార్ గుప్తా ని కలిసిన బీజేపీ సీనియర్ నాయకులు  కిలారు దిలీప్ ,బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి  సాదినేని యామిని శర్మ, అడ్వకేట్ బాచన హనుమంతరావు, సీనియర్ నాయకులు జయ ప్రకాశ్  బృందం. ధర్మవరం మరియు జమ్మలమడుగు పోలింగ్ బూతులులో అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున కేంద్ర భద్రతా బలగాలను నియమించాల్సిందిగా కోరటం జరిగింది. దీనిపైన స్పందించిన ముఖ్య ఎన్నికల అధికారి, 13-5-24 ఉదయం 10 గంటలకల్లా తీసుకున్న చర్యలపై రిపోర్ట్ సమర్పించవలసిందిగా డీజీపీని ఆదేశించటం జరిగింది. కోర్ట్ ఉత్తర్వులను అనుసరించి S. P. స్థాయి ప్రత్యేక పోలీస్ అధికారితో పాటు కేంద్ర భద్రతా బలగాలను నియమిస్తున్నట్లు బీజేపీ ప్రతినిధులకు తెలిపిన డీజీపీ. ఎన్నికలు సజావుగా జరుగుతాయని హామీ ఇచ్చిన డీజీపీ.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version