సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్త్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ

0

 *ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.తేదీ.12-05-2024.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్త్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్  పి.హెచ్.డి.రామకృష్ణ ఐ.పి.ఎస్.

రేపు ది.13.05.2024 తేదిన జరగబోవు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిదిలో ప్రజలు భారతదేశంలో రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకొనుటకు, భయపక్షపాతాలు లేకుండా ఉండేందుకు పోలీసు వారు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని తెలియజేస్తూ నిర్భయంగా ప్రజలందరూ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని, పారదర్శక మరియు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన బందోబస్త్ ఏర్పాట్లను ఈ రోజు పోలీస్ కమిషనర్  పి.హెచ్.డి. రామకృష్ణ ఐ.పి.ఎస్. అధికారులతో కలిసి రూరల్ జోన్, మైలవరం సబ్ డివిజన్ పరిదిలోని వెల్వడం, మైలవరం, నందిగామ సబ్ డివిజన్ పరిధిలోని పరిటాల గ్రామాలలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించి ఆయా ప్రాంతాలలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మరియు అక్కడ బందోబస్తు విధులను నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు సలహాలను అందించారు. అదేవిధంగా బందోబస్తు విధులను నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క   అవసరాలను గురించి ఆరా తీశారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్  పి.హెచ్.డి.రామకృష్ణ ఐ.పి.ఎస్.  తో పాటు మైలవరం  ఏ.సి.పి.  మురళి మోహన్ , ఇన్స్పెక్టర్లు ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version