మానవ అక్రమ రవాణా వ్యతిరేక పోరాటంలో భాధితుల రక్షణ, వారి సంక్షేమమే కేంద్రంగా అమలుచేసే విధానంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలి: విముక్తి డిమాండ్

0

మానవ అక్రమ రవాణా వ్యతిరేక పోరాటంలో భాధితుల రక్షణ, వారి సంక్షేమమే కేంద్రంగా అమలుచేసే విధానంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలి: విముక్తి డిమాండ్

విజయవాడ, జూలై 29: రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధo కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు సి.ఐ.డి డిపార్టుమెంటు చేస్తున్న కృషి అభినందనీయం కాని అక్రమ రవాణా కేసులు లేని రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్ ఖ్యాతి ని నిలపాలి అంటే భాధితుల రక్షణ, వారి సంక్షేమమే కేంద్రంగా మానవ అక్రమ రవాణా యూనిట్స్ ను బలోపేతం చేసి ట్రాఫికర్స్ కు శిక్షలు పడేలా చేయడంతో పాటు భాదిత మహిళలకు నష్టపరిహారం, పునరావాస సేవలు కూడా మానవ అక్రమ రవాణా యూనిట్స్ ద్వారా అందించాలని విముక్తి – అక్రమ రవాణా భాదిత మహిళల రాష్ట్ర సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి అపూర్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని యాట్ సెక్ – ఆంధ్ర ప్రదేశ్ చాప్టర్, విముక్తి,, హెల్ప్, ఆర్ హెడ్స్, మరియు గైడ్ స్వచ్ఛంద సంస్థలు స్థానిక ప్రెస్ క్లబ్ లో మానవ అక్రమ రవాణా భాదిత మహిళలతో మీడియా సమావేశం నిర్వహించారు.

శ్రీమతి అపూర్వ మాట్లడుతూ ఈ సంవత్సరం జాతీయ థీమ్ “మానవ అక్రమ రవాణా అనేది ఒక వ్యవస్థీకృత నేరం – ఈ దోపిడీని ముగించాలి” అనే స్ఫూర్తితో ఉంది. ట్రాఫికింగ్ అనేది యాదృచ్ఛికంగా ఏ ఒక్కరి ద్వారానో జరిగే నేరం కాదు — ఇది శక్తివంతమైన క్రిమినల్ నెట్‌వర్క్స్ ద్వారా లాభాపేక్షతో నడిచే వ్యవస్థ. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియా, నకిలీ ఉద్యోగ ప్రకటనల ద్వారా పేద, అంచున ఉన్న వర్గాల నుండి బాధితులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అంటూ 2016 నుండి 2022 వరకూ జాతీయ నేర గణాంక శాఖ గణాంకాల ప్రకారం:
• ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల క్రింద 1,396 కేసులు నమోదయ్యాయి, వాటిలో 2,119 బాధితులు రక్షించబడ్డారు.
• ఇమ్మొరల్ ట్రాఫికింగ్ చట్టం సెక్షన్ల క్రింద 594 కేసులు నమోదై, 771 బాధితులు రక్షించబడ్డారు.
• మొత్తం కేసుల్లో 887 కేసులు శిక్షలు లేకుండా ముగిశాయి, కేవలం 109 కేసుల్లోనే శిక్షలు విధించబడ్డాయి.
• మొత్తం గణాంకాల ప్రకారం శిక్షలు పడిన రేటు కేవలం 8% మాత్రమే ఉండటమే న్యాయ వ్యవస్థ లో ఉన్న లోపాలను చూపిస్తుంది.

గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ట్రాఫికింగ్ కేసుల్లో శిక్షలు లేకపోవడం లేదా అత్యల్పంగా ఉండటం వల్ల బాధితుల న్యాయం, రక్షణలో తీవ్ర వైఫల్యాలు ఎదురవుతున్నాయని ఆమె అందోళన వ్యక్తంచేశారు.

విముక్తి రాష్ట్ర శాఖ కోశాదికారి శ్రీమతి లక్ష్మి మాట్లాడుతూ “మనం కలిసికట్టుగా, అత్యవసర చర్యతో స్పందించాలి. మానవ అక్రమ రవాణాను నడిపించే అన్ని రకాల అక్రమ వ్యాపారలను ను ధ్వంసం చేయాలి — అక్రమ లాభాలను అడ్డగించి, న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలి. నేరస్తులకు తప్పనిసరిగా తగిన శిక్షలు పడితీరాలి.” అని నొక్కి చేప్పారు

విముక్తి రాష్ట్ర శాఖ నాయకురాలు శ్రీమతి శాంతి మాట్లడుతూ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కేవలం 13 జిల్లాల్లో మాత్రమే అధికారికంగా మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్లు ఏర్పాటు చేయబడ్డాయి. వీటికి పోలీస్ స్టేషన్ హోదా ఉన్నప్పటికీ, అవి స్వతంత్రంగా ట్రాఫికింగ్ కేసులను దర్యాప్తు చేయడంలో విఫలమయ్యాయి.
అందుకోసం రాష్ట్రంలోని మిగిలిన 13 జిల్లాల్లో కుడా అధికారికంగా మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్లు లు తక్షణమే ఏర్పాటు చేయాలి, అలాగే అన్ని యూనిట్లు పూర్తి స్థాయిలో కేసుల విచారణ, బాధితులకు మద్దతు ఇచ్చేలా అధికారంతో బలోపేతం చేయాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ క్రింది చర్యలు చేపట్టాలని విముక్తి డిమాండ్ చేస్తున్నది:
• AHTU లకు స్పష్టమైన అధికారాలు కల్పించాలి
• తగిన సిబ్బంది, వసతులు, సాంకేతిక పరికరాలు ఇవ్వాలి
• భాధితుల రక్షణ, వారి సంక్షేమమే కేంద్రంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి
• నష్టపరిహారం ప్రక్రియను సరళీకరించాలి
• రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫికింగ్ కేసుల కోసం కేంద్రీకృత ఆన్లైన్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి

ఈ సమావేశంలో హెల్ప్ సంస్థ కార్యదర్శి నిమ్మరాజు రామమోహన్, ప్రాజెక్ట్ మేనేజర్ వి.భాస్కర్, ఆర్ హెడ్స్ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.రామకృష్ణ , గైడ్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ సుజాత, విముక్తి నుంచి మెహరున్నీసా, శాంతి, అనూష తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version