సెంట్రల్ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు

0

10-6-2025*సెంట్రల్ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు*ధి:10-6-2026 మంగళవారం ఉదయం సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముని తనయుడు, కోట్లాదిమంది మంది అభిమానుల గుండెచప్పుడు, బసవతారకం ట్రస్ట్ ద్వారా లక్షలాది మందికి ఉచిత క్యాన్సర్ చికిత్స అందిస్తున్న మానవతమూర్తి, హిందూపురం హ్యాట్రిక్ MLA, పద్మభూషణ్ నటరత్న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు కేక్ కట్ చేసి అభిమానులకు మిఠాయిలు తినిపించడం జరిగిందిఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-50 ఏళ్లుగా సినీ రంగంలో తిరుగులేని విధంగా రాణిస్తున్న లెజండరీ హీరో…బసవతారకం ట్రస్టు ఛైర్మన్‌గా క్యాన్సర్ రోగులకు సేవలందిస్తున్న నిస్వార్థ ప్రజా సేవకులు, హిందూపురం శాసనసభ్యులు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సినీ, రాజకీయ, సేవారంగాల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని భారతదేశ సినీ చరిత్రలో నందమూరి నట వారసుడిగా 50 యేండ్లు పూర్తి చేసుకున్న ఏకైక అగ్ర కథానాయకుడు, హిందూపూర్ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈమధ్యనే పద్మభూషణ్ అవార్డు అందించడం హర్షించ దగ్గ విషయం అనిఇటు సినీ పరిశ్రమలో లెజెండ్ గా,అటు రాజకీయ రంగంలో ప్రజనేతగా, సేవా కార్యక్రమాల్లో గొప్ప మనసున్న మనిషిగా,50 సంవత్సరాల సినీ ప్రయాణంలో 109 సినిమాలతో ప్రేక్షకులను అలరించి ఆయన,పేదవారికి ఉచిత వైద్యం అందించే క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసి, మరెన్నో విజయాలు అందుకోవాలని, ఇంకా సమాజానికి విశేష సేవలు అందించాలి అని నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఈ సందర్భంగా బాలకృష్ణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యలవర్తి శ్రీకాంత్,ఘంటా కృష్ణమోహన్, హర్షవర్ధన్, కొడాలి వంశీ, LSR, కర్ణం రమణ, వీర భద్రం, నాగమణి, ఆకుల సూర్యప్రకాష్, సోమన అనిల్,వెలగపూడి శ్రీను, లక్కీశెట్టి కనకారావు, తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version