సంక్షేమం, అభివృద్ధి ఒకేసారి అమ‌లు చేయ‌గ‌లిగే ఏకైక నాయ‌కుడు సీఎం చంద్ర‌బాబు నాయుడు :ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ తో క‌లిసి

0

04-07-2025

సంక్షేమం, అభివృద్ధి ఒకేసారి అమ‌లు చేయ‌గ‌లిగే ఏకైక నాయ‌కుడు సీఎం చంద్ర‌బాబు నాయుడు :
ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

17వ డివిజ‌న్ లో సుప‌రిపాల‌న‌లో తొలిఅడుగు కార్య‌క్ర‌మం

  • ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ తో క‌లిసి పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని

*ఇంటింటికి వెళ్లి ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల క‌ర‌ప‌త్రాలు పంపిణీ

*ఏడాది ఎన్డీయే కూట‌మి పాల‌న పై ప్ర‌జాభిప్రాయం తెలుసుకున్న ఎమ్మెల్యే, ఎంపీ

సుప‌రిపాల‌న తొలి అడుగు కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న‌

విజ‌య‌వాడ : వైసిపి పాల‌న‌లో రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌లేదు. ఎన్డీయే కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌టంతో పాటు , అభివృద్ది కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి ఒకేసారి అమ‌లు చేయ‌గ‌లిగిన ఏకైక నాయ‌కుడు సీఎం చంద్ర‌బాబు నాయుడు అంటూ విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు.

మూడో రోజు సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్య‌క్ర‌మాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వర్గం 17 డివిజ‌న్ రాణిగారితోట‌లో ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ తోపాటు స్థానిక నేతల‌తో క‌లిసి శుక్ర‌వారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్ర‌జ‌ల‌కు అందుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ప్ర‌తి కుటుంబం ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ ల‌కు కూట‌మి ప్ర‌భుత్వం అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌పై వారి ఆనందం వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారన్నారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు వివరించేలా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి సీఎం చంద్ర‌బాబు దిశా నిర్దేశం చేశారన్నారు. ఐదేళ్ల వైసిపి విధ్వంస పాలన నుండి కూటమి ప్రభుత్వం వచ్చాక వికాసం వైపు ఏపీ పయనిస్తుందన్నారు. ఈ ఏడాదిగా రాష్ట్రంలో చేసిన మేలు, చేయబోయే పనులు ప్రజల‌కు వివ‌రిస్తున్న‌ట్లు తెలిపారు.

రాష్ట్రంలో లోటు బ‌డ్జెట్ లో వున్నా సంక్షేమం, అభివృద్ది ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాల‌నే ల‌క్ష్యంతో అధికారంలో రాగానే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చెప్పిన విధంగా పెన్ష‌న్ వెయ్యి రూపాయ‌లు పెంచి…ప్ర‌తి నెల ఒకటో తారీఖు నాలుగు వేల రూపాయ‌లు అందించ‌టం జ‌రుగుతుంద‌న్నారు. సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు జెట్ స్పీడ్ లో అమ‌లు చేస్తోంద‌న్నారు. ప్ర‌తి ప‌క్షంలో వున్న‌ప్పుడు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడామని…అధికారం లో వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నిత్యం ప్ర‌జ‌ల్లోనే వుంటున్నామన్నారు

గ‌త ప్ర‌భుత్వం పేద‌ల‌కు రూ.5ల‌కు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూసివేస్తే…సీఎం చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోపే రాష్ట్రంలో 204 అన్న క్యాంటీన్లు పున‌రుద్ధ‌రించిన‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు సీఎం చంద్ర‌బాబు కృషి చేస్తున్నాడ‌న్నారు.

అలాగే మ‌హిళ‌ల‌కు ఏడాదికి 3 గ్యాస్ సిలిండ‌ర్లు ఉచితంగా అందిస్తుండ‌టంతో మ‌హిళ‌ల‌కు ఆర్థికంగా ఉప‌యోగ‌క‌రంగా వుంద‌న్నారు. త‌ల్లివందనం ప‌థ‌కం కింద ఇంట్లో ఎంత మంది చ‌దువుకుంటే అంత‌మందికి ప‌దిహేను వేల రూపాయ‌లు ఇవ్వ‌టం జరిగింద‌న్నారు. పాఠ‌శాల‌లు తెరిచే స‌మ‌యానికి త‌ల్లివంద‌నం కింద ఇంట్లో ఎంత మంది విద్యార్ధులు వుంటే అంత మందికి పదిహేను వేల రూపాయ‌ల చొప్పున‌ ఇవ్వ‌టంతో విద్యార్ధుల త‌ల్లిదండ్రులు ఆనందంగా వున్నార‌ని తెలిపారు.

అదే విధంగా ఆగ‌స్టు 15వ తేదీ నుంచి మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం అమ‌లు చేయ‌బోతున్నార‌ని, ఇందువ‌ల్ల ఆటో డ్రైవ‌ర్ల ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా వుండేందుకు ఆగ‌స్టు 14వ తేదీ ప‌దిహేను వేల రూపాయాలు ఆటో డ్రైవ‌ర్ల‌కు అందించ‌నున్న‌ట్లు తెలిపారు. అలాగే నిరుద్యోగ భృతి కూడా నిరుద్యోగులకు అందించేందుకు డేటా సేక‌రణ పూర్తి అయింద‌ని, మ‌రో మూడు నెల‌ల్లో నిరుద్యోగ భృతి అందించ‌టానికి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసిన‌ట్లు వెల్ల‌డించారు. పీ 4 లింక్ ద్వారా ప్ర‌తి నెల మ‌హిళ‌ల‌కు ప్ర‌తినెల రూ.1500 భృతి ఇచ్చేందుకు కూట‌మి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. రైతు సంక్షేమం కోసం ఈ నెలాఖ‌రులో అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కం రైతుల‌కు రూ.20 వేలు అందించ‌నున్న‌ట్లు తెలిపారు.

అనంత‌రం ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ మాట్లాడుతూ ప్ర‌తి నెల మొద‌టి తారీఖు నాలుగు వేల రూపాయాలు పెన్ష‌న్ పేద ప్ర‌జ‌ల‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా అందిస్తున్నారు. ఒక‌వేళ ఒక‌టో తేదీ ఆదివారం వ‌స్తే…ముందురోజే పెన్ష‌న్ పంపిణీ చేయ‌టం జ‌రుగుతుంద‌న్నారు. పెన్ష‌న్ తో పాటు అనేక సంక్షేమ ప‌థ‌కాల‌కు రూపక‌ల్ప‌న చేసిన వ్య‌క్తి సీఎం చంద్ర‌బాబు నాయుడు అంటూ కొనియాడారు. త‌ల్లివంద‌నం ప‌థ‌కం ద్వారా ల‌బ్ధి పొందిన విద్యార్ధులు త‌ల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్య‌క్తం చేయ‌టంతోపాటు సీఎం చంద్ర‌బాబు కి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నార‌ని చెప్పారు. ఒక కుటుంబంలో ఎంత‌మంది చ‌దువుకుంటే అంత‌మందికి ఒక్కొక్క‌రికి రూ.15 వేలు చొప్పున ఇవ్వ‌టం జ‌రిగింద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం పై న‌మ్మ‌కం రెట్టింపు అయింద‌న్నారు. సంక్షేమాన్ని, అభివృద్దిని రెండు క‌ళ్ల‌లా స‌మ‌ర్ధ‌వంతంగా తీసుకువెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ది చేయ‌గ‌ల నాయ‌కుడు సీఎం చంద్ర‌బాబు నాయుడుకే సాధ్య‌మన్నారు.

ఈ కార్యక్రమంలో 17వ డివిజ‌న్ అధ్య‌క్షుడు రాయి రంగ‌మ్మ‌ , 18వ డివిజ‌న్ అధ్య‌క్షుడు వేముల దుర్గారావు , కార్పొరేటర్లు ముమ్మ‌నేని ప్ర‌సాద్ , చెన్నుపాటి ఉషారాణి , శాలివాహ‌న కుమ్మ‌రి సంక్షేమ అభివృద్ది కార్పొరేష‌న్ చైర్మ‌న్ పెరేపి ఈశ్వ‌ర్ , మైనార్టీ సెల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్.ఎమ్.ఫైజాన్ , ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌ , ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్య‌క్షుడు క‌రీముల్లా , టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ప‌రుచూరి ప్ర‌సాద్ , టిడిపి నాయ‌కులు యెర్నేని వేద‌వ్యాస్ , బూత్ క‌న్వీన‌ర్లు మొక‌ర ర‌మ‌ణ‌ , పుట్లా ర‌మ‌ణ‌ , బాషా , భ‌ద్ర‌ , జానీ , ర‌మ‌ణ‌య్య‌ , మొక‌ర రంగా మ‌హాల‌క్ష్మీ, మ‌హేష్, మార్కండేయులు , మైల‌మూరి పీరుబాబు, ప‌గ‌డాల వెంక‌టేశ్వ‌ర‌రెడ్డి , అంబ‌టికాశి , ప‌త్తిరామారావు ల‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version